Saturday, April 20, 2024
- Advertisement -

దేశంలో ముమ్మరంగా రెండో దశ క‌రోనా వాక్సినేష‌న్.. టీకా వేయించుకున్న కిష‌న్ రెడ్డి

- Advertisement -

దేశంలో క‌రోనా వైర‌స్ కొత్త కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్ర‌భుత్వం వేగ‌వంతం చేసింది. దీనిలో భాగంగా నేటి నుంచి రెండో ద‌శ క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను దేశవ్యాప్తంగా ప్ర‌భుత్వం ప్రారంభించింది. టీకా వేసే ప్రాధాన్య‌త క్ర‌మంలో ప్ర‌స్తుతం 60 ఏండ్ల‌కు పైబ‌డిన వారితో పాటు దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న 45 ఏండ్లు దాటిన వారికి సైతం టీకాను అందిస్తున్నారు.

కాగా, రెందో ద‌శ వ్యాక్సినేష‌న్‌కు ఇప్ప‌టివ‌ర‌కు 24.5 లక్షల మంది సామాన్య ప్ర‌జ‌లు త‌మ పేరును వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి రిజిస్ట‌ర్ చేయించుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. కోవిన్‌, ఆరోగ్య సేతు యాప్‌ల‌లో రిజిస్ట‌ర్ చేసుకునే వెసులుబాటు లేనివారు నేరుగా టీకా కేంద్రాల్లో త‌మ పేర్ల‌ను రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని అధికారులు వెల్ల‌డించారు. కాగా, దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు మళ్లీ పెరుగుతుండ‌టం, కొత్త వేరియంట్లు వెలుగులోకి రావ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్త మ‌వుతోంది.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ బీజేపీ సినీయ‌ర్ నేత‌, కేంద్ర వ్య‌వ‌హారాల స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి తాజాగా క‌రోనా టీకా తీసుకున్నారు. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయ‌న వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ క్ర‌మంలోనే కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్‌ను త‌రిమేందుకు అంద‌రూ టీకాకు వేయించుకోవాల‌ని అన్నారు. టీకాపై అపోహ‌లు వ‌ద్ద‌నీ, ప్ర‌ధాని మోడీ సైతం కోవిడ్‌-19 టీకాను తీసుకున్నార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు.

Also Read

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -