- Advertisement -

మూడు పెళ్లిలు చేసుకున్నాడని మాడు పగలగొట్టింది

- Advertisement -

భర్త మూడు పెళ్లిలు చేసుకున్నాడని అతని మాడు పగలగొట్టింది ఒక ఇల్లాలు. ఇక వివరాల్లోకి వెళితే రాజేంద్ర నగర్ బండ్లగూడ లో ఉంటున్న సెక్రటేరియేట్ లో ఉద్యోగి మహేష్ అతను తొలుత పద్మను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. పద్మకు తెలియకుండా మహేష్ రెండవ వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత పద్మకు ఆ విషయం తెలిసింది.

ఆమె బంధువులను తీసుకొని వెళ్లి అతనికి బుద్ధి చెప్పింది. ఆ రెండవ భార్య అతనిని వదిలి వెళ్లిపోయింది.కుక్క తోక ఎంత వంచినా ఒంకరే అన్నట్లు ఆ తరువాత మహేష్ మళ్లీ జ్యోతి అనే యువతిని మూడవ పెళ్లి చేసుకున్నాడు.. మహేష్  జ్యోతి వద్ద ఉండగా, పద్మ తన పిల్లలు, బంధువులను తీసుకొని వచ్చి భర్తకు దేహశుద్ధి చేసింది., గూబ గుయ్య్.. మనిపించింది. మహేష్ పై రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -