Friday, April 19, 2024
- Advertisement -

కరోనా వాక్సిన్ పై.. వైట్ హౌస్ కొత్త ప్రకటన..!

- Advertisement -

కరోనా వ్యాక్సిన్​కు అత్యవసర అనుమతులు లభించిన వెంటనే.. టీకాను దేశవ్యాప్తంగా సరఫరా చేసేందుకు తగిన ప్రణాళిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం వద్ద ఉందని వైట్ హౌస్ వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి 40 మిలియన్​ డోసులు అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది.

తమతో వ్యాక్సిన్​ సరఫరా ప్రణాళికలను ట్రంప్​ ప్రభుత్వం పంచుకోవడం లేదని.. అసలు అధ్యక్షుడి యంత్రాంగానికి ఆ సామర్థ్యం ఉందా? అని 2020 అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​ ఇటీవల ప్రశ్నించిన నేపథ్యంలో వైట్ హౌస్ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తాము రూపొందిస్తున్న వ్యాక్సిన్​లు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఫైజర్​, మోడెర్నా సంస్థలు ఇటీవలే ప్రకటించాయి. ఆపరేషన్​ వార్ప్​ స్పీడ్​ పేరుతో.. టీకా ఉత్పత్తి, సరఫరా కోసం ఫైజర్​తో 1.95 బిలియన్​ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది ట్రంప్​ ప్రభుత్వం.

చైనా పై గురి పెట్టిన బైడెన్ ..!

పాలనాయంత్రాంగంపై బైడెన్ దృష్టి..!

అమెరికా జుట్టు చైనా చేతిలో..!

ఫైజర్‌ రావడానికి రంగం సిద్ధం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -