Monday, April 29, 2024
- Advertisement -

చైనా పై గురి పెట్టిన బైడెన్ ..!

- Advertisement -

చైనాతో అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. చైనా నిబంధనల ప్రకారం నడుచుకునేలా చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అలాగే తమ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ, పారిస్ పర్యావరణ ఒప్పందంలో తిరిగి చేరబోతున్నట్లు ప్రకటించారు.

డెలావెర్​ విల్మింగ్టన్​లోని తన స్వస్థలంలో గవర్నర్లతో గురువారం సమావేశమయ్యారు బైడెన్​. ఈ సందర్భంగా బీజింగ్​ ప్రవర్తనను అనుసరించి చైనాపై ఆంక్షలు ఉంటాయని అధ్యక్ష సంవాదంలో పేర్కొనటంపై అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ‌78 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. యూఎస్‌ చరిత్రలో 78 ఏళ్ల వయస్సులో బాధ్యతలు చేపట్టనున్న తొలి అధ్యక్షుడిగా బైడెన్‌ నిలవనున్నారు. ఇప్పటివరకు లేటు వయస్సులో అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తిగా రోనాల్డ్‌ రీగన్ ఉండగా… ఆయన్ను అధిగమిస్తూ జనవరిలో బైడెన్‌ ప్రమాణం చేయనున్నారు. రోనాల్డ్‌ రీగన్‌ తన 77 ఏళ్ల ప్రాయంలో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ జాబితాలో ట్రంప్ మూడో స్థానానికి వెళ్లనున్నారు.

ఫేస్​బుక్ లో తేడా వచ్చింది..!

బరాక్ ఒబామా స్వీయ అనుభవాలకి భారీ స్పందన..!

హాంకాంగ్​కి అమెరికా మద్దతు..!

పాలనాయంత్రాంగంపై బైడెన్ దృష్టి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -