బాబుకు బిగ్ షాక్… వైసీపీలోకి టీడీపీ ఎమ్మేల్యే

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆపార్టీలోని నాయకులంతా తలో దారి చూసుకుంటున్నారు. ఇప్పటికే కీలక నేతలు వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. జగన్ అనుకుంటే ఒక్క రోజులో టీడీపీ పార్టీ కాలీ అవుతుంది. కాని వలసలను ప్రోత్సహించనని పార్టీలోకి రావాలనుకుంటే పదవులకు రాజీనామా చేసిన రావాలని షరతు పెట్టడంతో బాబు బతికిపోయారు. లేకుంటేఈ పాటికి టీడీపీ ఎప్పుడో కాలీ అయ్యేది.

గెలిచిన ఎమ్మెల్యేల్కూలో కొందరు ఫిరాయించే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఎవరు పార్టీ మారినా సరే.. అనర్హత వేటు వేయడం తథ్యం అని స్పీకరు తమ్మినేని సీతారాం చాలా స్పష్టంగా ప్రకటించేశారు.అందువల్లే ఫిరాయింపులు ఆగుతున్నాయని, లేకపోతే.. ఈపాటిక పదికి పైగా ఎమ్మెల్యేలు భాజపాలో చేరిపోయి ఉండేవారని ఒక ప్రచారం ఉంది.

- Advertisement -

జగన్ ఆ కండీషన్ పెట్టడంతో ఎక్కవ మంది నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న భాజాపా వైపు వెల్తున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభసభ్యులు, ముఖ్య నేతలు కాషాయ కండువా కప్పుకన్నారు. కాని ఇప్పుడు మాత్రం టీడీపీ నుంచి ఓ ఎమ్మేల్యే వైసీపీలోకి వచ్చేందుకు సిద్దమయ్యారు. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో టీడీపీలో ఆందోళన మొదలయ్యింది. ఒకరు మొదలు పెడితే పార్టీలో ఒకరిద్దరు తప్ప ఎవరూ ఉండని బాబు వణికిపోతున్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి మాత్రం రాజీనామా చేసి కాపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆయన రాజీనామా లాంఛనం అవుతుందని చెబుతున్నారు.తెలుగుదేశానికి రాజీనామా చేవైకాపా తరుపున మల్లీ ఫ్యాను గుర్తుపై పోటీచేసి అసెంబ్లీ కి రావడానికి గొట్టిపాటి రవి సిద్ధంగా ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గొట్టిపాటి రవికి స్థానికంగా కరణం బలరాం కొడుకు వెంకటేష్ తో చాలా చికాకులు ఎదురవుతున్నాయి.

మొదటి నుంచి కరణం బలరాం, గొట్టిపాటి రవికి మధ్య పచ్చగడ్డి వేస్తె బగ్గుమంటుంది. ఇద్దరిని బాబు రాజీ చేసినా లోపల మాత్రం విబేధాలు ఉన్నాయి. బలరాం కొడుకు వెంకటేష్ తో విబేధాలు ఎక్కువవడంతో టీడీపీలో ఉండే దానికంటె వైసీపీలోకి వెల్లడం మంచిదని రవికుమార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. జగన్ మేనియాలో కూడా గొట్టిపాటి రవి కుమార్ గెలిచాడంటే స్థానికంగా ఆయనకు ఎంత బలం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి సమయంలో టీడీపీలో ఉండేదానికంటే తనకు ప్రజాబలం ఉన్నప్పుడు భవిష్యత్తులేని టీడీపీలో ఉండేదాని కంటే పదవికి రాజీనామా చేసి అయినా వైకాపాలో చేరడం ఉత్తమం అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. జగన్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.

గొట్టిపాటి రవికుమార్ తో మొదలు పెడితే ఆయనతో పాటి వరుసగా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరడం ఖాయం. ఇదే జరిగితే టీడీపీలో బాబు, లోకేష్, అచ్చెన్న తప్ప మరెవరూ మిగలరు. పార్టీ పరిస్థితి తెలంగాణాలో కంటే ఘోరంగా తయారవుతుంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -