ఆన్లైన్ లోన్ యాప్స్ విషయంలో.. జాగ్రత్త !

- Advertisement -

ఇటీవల కాలంలో లోన్ యాప్స్ వేధింపులు మరి ఎక్కువయ్యాయి. సామాన్యుడి నుంచి మంత్రి హోదాలో ఉన్న వారి వరకు చాలా మంది ఈ లోన్ యాప్స్ వేదింపులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు లోన్ తీసుకోవాలంటే.. స్థిర చర ఆస్తి వివరాలతో పాటు.. ఎన్నో డాక్యుమెంట్స్ బ్యాంకు కు సమర్పిస్తే తప్ప లోన్ వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్ యుగంలో అలా కాదు. ఒక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు ద్వారా క్షణాల్లో లోన్ ఇచ్చే యాప్స్ ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వరకు అన్నీ ఫెక్ యాప్సే అయినప్పటికి క్షణాల్లో లోన్ వస్తుండడంతో చాలా మంది మొబైల్ లోన్ యాప్స్ వైపు చూస్తున్నారు. .

మొదట జీరో పర్సెంట్ వడ్డీ అని చెప్పే మొబైల్ యాప్స్ ఆ తరువాత లెక్కకు మించి వడ్డీ రేటుతో సామాన్యుడి కష్టాన్ని జలగల్ల పిలుస్తున్నాయి. ఈ లోన్ యాప్స్ నుంచి వేదింపులకు గురౌతున్న భాదితులు ఎంతో మంది ఉన్నారు. ఇటీవల మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ లోన్ యాప్స్ నుంచి ఫెక్ కాల్స్ ఎదుర్కొన్నా సంగతి ఎంతటి సంచలనం అయిందో అందరికీ తెలిసిందే. దాంతో ఈ లోన్ యాప్స్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. లోన్ యాప్స్ ద్వారా రికవరీ పేరుతో ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే తమ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని, త్వరలోనే ఫెక్ లోన్ యాప్స్ పై చర్యలు తీసుకోబోతున్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు.

- Advertisement -

ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫెక్ లోన్ యాప్స్ పై స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ లోన్ యాప్స్ పై స్పందిస్తూ.. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న చాలా రకాల లోన్ యాప్స్ పై సందేహాలున్నాయని, వాటి ద్వారా లోన్ తీసుకున్న చాలా మంది వేదింపులకు గురౌతున్నారని ఆమె అన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వంటి విభాగాలతో పారు మరి కొన్ని విభాగాలు కూడా ఈ ఫెక్ లోన్ యాప్ పై ఉక్కుపాదం మొపేందుకు చర్యలు తీసుకోబోతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఏది ఏమైనప్పటికి ఈ ఫెక్ లోన్ యాప్స్ విషయంలో సామాన్యులు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా లోన్ పేరుతో డబ్బు కట్టమని వేదింపులకు గురి చేస్తుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విశ్లేషకులు సైటెమ్ హెచ్చరిస్తున్నారు.

Also Read

చైనా భారత్ ను ఎందుకు టార్గెట్ చేస్తోంది ?

సంక్షోభం గుప్పెట్లో.. మరికొన్ని దేశాలు ?

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -