Sunday, May 12, 2024
- Advertisement -

జంపింగ్  జిలానీకు పెద్ద‌పీట వేసిన బాబు..

- Advertisement -
Andhra Pradesh Chandrababu Naidu’s new cabinet

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్తీక‌ర‌న పూర్త‌య్యింది.కేబినేట్‌లో  ఐదుగురికి ఉద్వాస‌న ప‌లికి ప‌ద‌కొండు మందిని కొత్త మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు.

మంత్రి వ‌ర్గంలో పార్టీ కోసం ప‌నిచేసిన వాల్లు కాకుండా జంపింగ్ జిలానీల‌కే పెద్ద‌పీట వేశాడు చంద్ర‌బాబునాయుడు.11 మంది కొత్త మంత్రుల్లో నలుగురు మాత్రం వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేలుగా విజయం సాధించి… ఆ తర్వాత టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగిపోయిన 21 మందిలో ఉన్నవారే. వారే భూమా అఖిలప్రియ – ఎన్.అమర్ నాథ్ రెడ్డి – ఆదినారాయణరెడ్డి – సుజయకృష్ణా రంగారావు. 

జంపింగ్‌జిలానీల ఆర్హ‌త‌లు ప‌రిశీలిస్తే  కేవలం తనకు కొరకరాని కొయ్యగా మారిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మోసం చేసి… టీడీపీలో చేరిపోవడమేనన్న వాదన వినిపిస్తోంది. భూమా అఖిల ప్రియ… ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేనే. పెద్దగా రాజకీయాల్లో అనుభవం కూడా లేదు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం ముగించుకుని ఇంటికి తిరిగివెళుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో భూమా శోభానాగిరెడ్డి హఠాన్మరణం చెందారు. అప్పటిదాకా రాజకీయ వాసనలే తెలియని భూమా అఖిలప్రియ అప్పటికప్పుడు రాజకీయాల్లోకి వచ్చేశారు.భూమా కుటుంబానికి అండ‌గా నిలవాల‌న్న కార‌నంతో జ‌గ‌న్ ఎమ్ ఎల్ ఏ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు త‌ర్వాత తండ్రితోపాటు టీడీలోకి జంప్ అయ్యారు. 

త‌ర్వాత విడ‌త‌ల‌వారీగా టీడీప‌లోకి జంప్ అయిన‌ఆదినారాయణరెడ్డి – అమర్ నాథ్ రెడ్డి – సుజయకృష్ణా రంగారావు సహా 21 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయకుండానే టీడీపీలో చేరిపోయారు. ఈ 21 మందిలో ఇప్పుడు భూమా – సుజయ – ఆది – అమర్ లకు మంత్రి పదవులు దక్కాయి. వీరికున్న అర్హత కేవలం జగన్ ను వ్యతిరేకించడమేనన్న వాదన వినిపిస్తోంది. మ్మలమడుగులో టీడీపీ ఆది నుంచి అండగా నిలబడ్డ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఉన్నా… ఆయనను బుజ్జగించి మరీ ఆదికి మంత్రి పదవి ఇవ్వడం వెనుక ఉన్న అసలైన కారణం… జగన్ పట్ల ఆయనకున్న వ్యతిరేకతనేనని చెప్పక తప్పదన్న విశ్లేషణ లేకపోలేదు. 

చంద్ర‌బాబు ప్ర‌ధానంగా రాయ‌ల‌సీమ‌కు చెందిన నేత‌ల‌కు అధిక ప్రాధాన్య‌మివ్వ‌డంల‌చూస్తే జ‌గ‌న్‌కు చెక్‌పెట్టేందుకే అనీ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. రాయ‌ల‌సీమ‌జిల్లాల్లో జ‌గ‌న్‌ను గ‌ట్టిగా ఎదుర్కోవాలంటే మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం త‌ప్ప  వేరేమార్గంలేదు. త్వ‌ర‌లోనంద్యాల ఉప ఎన్నిక ఉన్న నేప‌ధ్య్ంలో భూమ ఆ అఖిల ప్రియ‌ల‌కు మంత్రిప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌నేది బ‌హిరంగ‌ర‌హ‌స్య‌మే. ఇక అదినారుఆయ‌ణ రెడ్డిని చూసుకుంటే జ‌గ‌న్ సోంత జిల్లా క‌డ‌ప‌లో జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ముందుకు సాగ‌డంమే ఏకైక అర్హ‌త‌. రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్‌కు చెక్ పెట్టాల‌నే ఉద్దేశంతో ఇన్ చార్జి మంత్రి గంటా శ్రీనివాస‌రావు మంత్రి ప‌దవులు వ‌చ్చేలా చేయ‌డంలో స‌ప‌లీకృతుడయ్యాడు. మంత్రి వ‌ర్గ విస్త‌ర స‌మీక‌ర‌నాలు చూసుకుంటే 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు చెక్ పెట్టేందుకే వ్యూహ‌ర‌చ‌న చేసిన‌ట్లు తెలుస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -