Sunday, May 5, 2024
- Advertisement -

కొత్త ఏదాడిలో ఏపీలో కొలువు తీరిన హైకోర్టు..సీజేగా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం

- Advertisement -

కొత్త సంవ‌త్స‌రం వేల ఎట్ట‌కేల‌కు ఏపీలో హైకోర్టు కొలువు తీరింది. తొలి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌మాణ శ్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరో 13 మంది న్యాయమూర్తులతో గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ హాజరయ్యారు.

ఏపీ విభజన నేపథ్యంలో 62ఏళ్ల తర్వాత సోమవారం అమరావతికి హైకోర్టు తరలివెళ్లింది. దీంతో రాష్ట్రంలో చారిత్రక ఘటం ఆవిష్కృతమైంది. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్ప‌టినుంచి 2018 డిస్సెంబ‌ర్ చివ‌ర వ‌ర‌కు ఉమ్మ‌డి హైకోర్టుగా కొన‌సాగింది. 2018 డిసెంబరు 26న ఉమ్మడిహైకోర్టు విభజన నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో నేటి నుంచి అమరావతి కేంద్రంగా ఏపీ రాష్ట్ర హైకోర్టు విధులు ప్రారంభమయ్యాయి. హైకోర్టు భ‌వ‌నాలు పూర్తి కాక పోవ‌డంతో సీఎం క్యాంపు ఆఫీసులో తాత్కాలిక హైకోర్టు భ‌వ‌నాన్ని ఏర్పాటు చేశారు.

జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఫిబ్రవరి 26, 1961లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సి.పద్మనాభరెడ్డి ప్రముఖ క్రిమినల్‌ లాయర్, గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. 10వ తరగతి వరకు ప్రవీణ్‌కుమార్‌ విద్యాభ్యాసం హైదరాబాద్‌ లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో సాగింది. లిటిల్‌ ఫ్లవర్‌ జూనియర్‌ కాలేజీ నుంచి ఇంటర్‌ చేసి నిజాం కాలేజీ నుంచి బీఎస్‌సీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

2012 జూన్‌ 29న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 డిసెంబర్‌ 4న శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు.. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఛీఫ్ జ‌స్టిస్‌గా న‌య‌మితుల‌య్యారు.

జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటు ప్రమాణ స్వీకారం చేసిన మిగతా న్యాయమూర్తులు..

  1. జస్టిస్ వెంకట నారాయణ భట్టి
  2. జస్టిస్ వెంకట శేష సాయి
  3. జస్టిస్ సీతారామ మూర్తి
  4. జస్టిస్ దుర్గా ప్రసాద రావు
  5. జస్టిస్ సునీల్ చౌదరి.
  6. జస్టిస్ సత్యనారాయణ మూర్తి
  7. జస్టిస్ శ్యాం ప్రసాద్
  8. జస్టిస్ ఉమ దేవి
  9. జస్టిస్ బాలయోగి
  10. జస్టిస్ రజని
  11. జస్టిస్ వెంకట సుబ్రమణ్య సోమయాజులు
  12. జస్టిస్ విజయ లక్ష్మి
  13. జస్టిస్ గంగా రావు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -