Friday, April 26, 2024
- Advertisement -

Alert: ‘సెకండ్​వేవ్’​ ముప్పు ఇంకా ఉంది.. కేంద్రం వార్నింగ్​

- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయని.. సెకండ్​వేవ్​ ముప్పు పోయిందని అంతా భావిస్తున్న తరుణంలో కేంద్ర ఆరోగ్యశాఖ బాంబు పేల్చింది. సెకండ్​వేవ్​ ముప్పు అప్పుడే పోలేదని.. ఇంకా చాలా జిల్లాల్లో దాని ప్రభావం ఉందని హెచ్చరికలు జారీచేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాలు లాక్​డౌన్​ ఎత్తేసిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రజలు సైతం విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. మాస్కులు ధరించడం లేదు. భౌతికదూరం పాటించడం లేదు. యథావిధిగా పెళ్లిళ్లు, ఇతర వేడుకలు జరుపుకొంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం హెచ్చరికలు జారీచేసింది.

కేరళ, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, చత్తీస్‌ఘడ్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఇంకా తగ్గలేదని.. పాజిటివ్​ రేటు ఎక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 71 జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్నాయని పేర్కొన్నది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Also Read: ఇలా చేస్తే థర్డ్ వేవ్​ రాకపోవచ్చు.. ! గులేరియా

ఇంకా కేంద్ర ఆరోగ్య శాఖ ఏమన్నదంటే.. ‘దేశంలో కరోనా కొంత మేర తగ్గుతున్నది. 86 శాతం తగ్గుదల నమోదైంది. గతంలో 81.1 శాతం ఉన్న రికవరీ రేటు .. ప్రస్తుతం 97 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతోంది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. నిన్న ఒక్కరోజే దేశంలో కొత్తగా 46వేల 617 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,04,58,251కి చేరింది.

Also Read: కరోనాతో మెదడు కణజాలంపై ప్రభావం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -