Saturday, May 18, 2024
- Advertisement -

అంత‌ర్జాతీయంగా ప‌రిస్తితు లు ఉద్రిక్తం ..ఏక్ష‌ణ‌మైనా యుద్ధం

- Advertisement -
Anti-missile system in South Korea operational in ‘coming days

కొరియా దేశాల మ‌ద్య తీవ్ర ఉద్రిక్త పిర‌స్థితులు నెల‌కొడంతో అంత్జాతీయంగా యుద్ధ‌మేఘాలు క‌మ్ముకున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన దేశాలు ఇప్పుడు చేత‌ల‌తో చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి.

ఇప్ప‌టికే ఉత్త‌ర కొరియా అణుక్షిప‌నుల‌ను ప్ర‌యేగించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించ‌డంతో అమోరికా మ‌రింత అప్ర‌మ‌త్త‌మైంది.ఇప్ప‌టికే జ‌పాన్‌,ద‌క్షిణ కొరియాతో అమెరికా సైనిక విన్య‌సాలు న‌ర్వ‌హించ‌డంత‌పాటు ద‌క్షిన కొరియాకు అమెరికాకు చెందిన వివాదాస్ప‌ద థాడ్ మిస్సైల్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ద‌క్షిణ కొరియాలో మోహ‌రించింది.
దీంతో కొరియా దేశాల్లో యుద్ధ‌మేగాలు కమ్ముకున్నాయి. ఏక్ష‌న‌మైనా యుద్దం జ‌రిగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. వాటిని నిజంచేస్తూ అమెరికా థాడ్ మిస్సైల్ వ్య‌వ స్థ‌ను మోహ‌రించ‌డం వీటికి బ‌లాన్ని క‌లిగిస్తున్నాయి. ఇది అత్యంత ప‌టిస్ట‌మైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ . దీనికి ప్ర‌త్యేక స్థానం ఉంది.ఒకవైపు ఉత్తర కొరియా మాటిమాటికీ క‌వ్వింపు చర్యల‌కు దిగుతున్న నేప‌థ్యంలో అమెరికా త‌న బ‌ల‌మైన మిసైల్ వ్య‌వ‌స్థ‌ను దక్షిణ కొరియాకు తీసుకువ‌చ్చింది. ఆ మిసైల్ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన వాహ‌నాలు సియోల్‌కు ద‌క్షిణంగా 250 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి బుధవారమే చేరుకున్నాయి.
థాడ్ క్షిపణి వ్యవస్థను … అమెరికా డిఫెన్స్ వాహ‌నాల్లో మిస్సైల్స్‌ను తీసుకువ‌చ్చారు. థాడ్ క్షిప‌ణులు రావ‌డాన్ని స్థానిక కొరియా ప్ర‌జ‌లు వ్య‌తిరేకించారు. ఈ నేపథ్యంలో వాహ‌నాల‌ను తీసుకువ‌స్తున్న రోడ్డు వెంట భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు. ఆందోళ‌న‌కారుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ప‌దిమంది గాయ‌ప‌డ్డారు.ఉత్తర కొరియాకు బుద్ధి చెప్పేందుకే… ఉత్తర కొరియా ప‌దేప‌దే చేస్తున్న మిసైల్ బెదిరింపుల‌ను ఎదుర్కొనేందుకు అమెరికా థాడ్ వ్య‌వ‌స్థ‌ను రంగంలోకి దించాల్సి వ‌చ్చిందిని అమెరికా వ్యాఖ్య‌నించింది. ఉత్త‌ర కొరియాకు మిత్ర‌దేశ మైన చైనా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది . ఈ థాడ్ మిస్సైళ్ల వ‌ల్ల కొరియా ప్రాంతంలో భ‌ద్ర‌త బ‌ల‌హీన‌మ‌వుతుంద‌ని చైనా ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.
యుద్ధ నౌకల మోహరింపు… ఉత్తర కొరియా మ‌రికొన్ని అణు, మిస్సైల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలని ప్ర‌య‌త్నిస్తున్న నేప‌థ్యంలో వివాదాస్ప‌ద కొరియా ద్వీప‌క‌ల్పానికి అమెరికా త‌న యుద్ధ‌నౌక‌ల‌ను కూడా పంపిస్తోంది. యుద్ధ నౌక‌లు మోహ‌రించ‌డంతో ప్ర‌స్తుతం తూర్పు ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త‌ వాతావ‌ర‌ణ నెల‌కొంది. ఏక్ష‌ణ‌మైనా దాడి ప్ర‌తిదాడులు జ‌రిగే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి.దీంతో అంతర్జాతీయంగా ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఏప్పుడు ఏం జ‌రుగుతుందోన టెన్స్ మొద‌లైంది..ఉత్త‌ర కొరియా ప్ర‌యేగించే స్వ‌ల్ప‌, మ‌ధ్య శ్రేణి క్షిప‌ణుల‌ను థాడ్ మిసైల్ వ్య‌వ‌స్థ మొద‌టి ద‌శ‌లోనే ధ్వంసం చేస్తుంది. ఉత్తర కొరియా దూకుడును అడ్డుకునేందుకే అమెరికా థాడ్ వ్య‌వ‌స్థ‌నతీసుకువ‌చ్చిన‌ట్లు ద‌క్షిణ కొరియా ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌ వెల్ల‌డించింది.
ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్న చైనా అప్ర‌మ‌త్త‌మైంది… మరోవైపు చైనా కూడా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారుచేసిన యుద్ధ‌నౌక‌ను ఇవాళే జ‌ల‌ప్ర‌వేశం చేయించింది. దీంతో ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే అమెరికాకు చెందిన జలాంతర్గామి యూఎస్ఎస్ మిచిగన్, యుద్దనౌక కార్ల్ విన్సన్ కూడా కొరియా ద్వీపకల్పానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. కొరియాస‌మీప‌జ‌లాల్లోకిఅమెరికా యుధ్ద‌నౌక‌లు-యుధ్ద‌వాతా వ‌ర‌ణం
  2. 2022 లో కామ‌న్ వెల్త్ క్రీడ‌ల్లో..క్రికెట్‌
  3. చిరిగిపోయిన చీపురు.. పుల్ల‌ల్ని ఏరుకుంటున్న కేజ్రీ….
  4. ఉద‌యం 6 నుంచ సాయంత్రం 6 వ‌ర‌కు పెట్రోల్ బంక్‌లు….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -