Monday, May 6, 2024
- Advertisement -

2022 లో కామ‌న్ వెల్త్ క్రీడ‌ల్లో..క్రికెట్‌

- Advertisement -
Men’s cricket a chance for 2022 Commonwealth Games if Birmingham

క్రికెట్ అంటే ఇష్టంలేని వారు ఉండ‌రు.చిన్నా పెద్దాతేడాలేకుండా ప్ర‌తీ ఒక్క‌రూ చూస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని దేశాలే క్రికెట్‌ను కొనాసాగిస్తున్నాయి.కానీ రాను రాను ఈజాబితాలోకి మ‌రిన్ని దేశాలు వ‌స్తున్నాయి. రోజు రోజుకీ క్రికెట్ అభిమానులు పెరిగిపోతున్నారు. క్రికెట్ దీనినుంచే వ‌చ్చే ఆదాయం చెప్పాల్సిన అస‌రంలేదు. ఇప్పుడు క్రికెట్‌ను 2022లో జ‌రిగే కామ‌న్ వెల్త్ క్రీడ‌ల్లో తిరిగి ప్ర‌వేశ పెట్టేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

2022లో బర్మింగ్‌హామ్ కామ‌న్ వెల్త్ క్రీడల‌కు ఆతిథ్య నగరంగా ఎంపికైతే 2022లో క్రికెట్‌ కామన్వెల్త్‌ పునరాగమనం చేయవచ్చు. కామన్వెల్త్‌ క్రీడలకు బిడ్‌ వేయాల్సిందిగా బ్రిటన్‌ ప్రభుత్వం బర్మింగ్‌హామ్‌ను ఆహ్వానించింది. నిజానికి డర్బన్‌ (దక్షిణాఫ్రికా) 2022 క్రీడలకు ఆతిథ్యమివ్వాల్సింది. కానీ ఆర్థిక, రాజకీయ కారణాల వల్ల ఆ నగరం ఉపసంహరించుకుంది.

మహిళల క్రికెట్‌ ఇప్పటికే డర్బన్‌ షెడ్యూలులో ఉంది. ఆతిథ్య హక్కులు దక్కితే పురుషుల క్రికెట్‌నూ చేర్చాలని భావిస్తున్నట్లు వార్విక్‌షైర్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌ ముఖ్యకార్యనిర్వహణ అధికారి, బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ బిడ్‌ కంపెనీ సభ్యుడు నీల్‌ స్నోబాల్‌ చెప్పాడు. టీ20 ఫార్మాట్లో టోర్నీ ఉంటుంది. కెనడా, మలేసియా, ఆస్ట్రేలియాల్లోని నగరాలు కూడా 2022 కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్య హక్కుల కోసం ప్రయత్నిస్తాయని భావిస్తున్నారు. గతంలో ఒకసారి, 1998లో మలేసియాలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌కు అవకాశం కల్పించారు. ఇదే జ‌రిగితే క్రికెట్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రింత అభిమానులు పెరుగుతారు.

Related

  1. మీరు కూడా గాల్లో ఎగ‌రొచ్చు…
  2. మీరు కూడా గాల్లో ఎగ‌రొచ్చు…
  3. ఫేస్‌బుక్ గురించి మీకు తెలియని చాలా విషయాలు..
  4. జియో సూపర్ ఆఫర్ : 810 జీబీ డేటా ఇస్తుంది

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -