Tuesday, May 14, 2024
- Advertisement -

ఏకగ్రీవంగా ఎన్నికైన అనురాగ్

- Advertisement -

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా బిజెపి ఎంపి అనురాగ్ ఠాకూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందరు ముందు ఊహించినట్లుగానే అనురాగ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. బోర్డు కార్యదర్శిగా వ్యాపారవేత్త అజయ్ షిర్కె ఎంపికయ్యారు. ఆదివారం జరిగిన బోర్డు సభ్యుల సమావేశంలో వీరిద్దరు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.

ఇంతకు ముందు బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న శశాంక్ మనోహర్ ఐసిసి చైర్మన్ కావడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. బిసిసిఐ అధ్యక్షుడిగా ఠాకూర్ ఏడు నెలల పాటు పదవిలో ఉంటారు. ఓ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ బిసిసిఐ అధ్యక్షపదవి పొందడం 17 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

ఇంతకు ముందు రాజ్ సింగ్ దుంగార్పూర్ బిసిసిఐ అద్యక్షుడిగా పనిచేశారు. ఈయన ఫస్ట్ క్లాస్ క్రికెటర్. అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ తరఫున ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -