Sunday, May 5, 2024
- Advertisement -

పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల ఆశ‌లు గ‌ల్లంతే…..

- Advertisement -
AP CM Chandrababu Naidu check to jumped mla’s

పార్టీని పిరాయించి టీడీపీ లో చేరిన ఎమ్మెల్యేక‌లు ఇక నుంచి చుక్క‌లు క‌నిపించ‌నున్నాయి.మంత్రి పదవులు వస్తాయని ఆశతో పార్టీ ఫిరాయించి భంగపడ్డ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కనీసం నామినేటెడ్‌ పదవులైనా రాకపోతాయా అని ఎదురుచూస్తూ బతుకుతున్నారు.

కానీ వారి గుండెల్లో ఆటం బాంబు పేల్చారు చంద్రబాబు.ఇక నుంచి ఎమ్మెల్యేల‌కు,ఎంపీల‌కు నామినేటేడ్ ప‌ద‌వులు ఇవ్వ‌న‌ని బాబు చెప్ప‌డంతో ఏం చేయాలో పిరాయింపు ప్ర‌జాప్ర‌తినిధిలు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డ్డారు.
టీటీడీ ప‌ద‌వి కోసం పార్టీలో కొంత‌కాలంగా తీవ్ర పోటీ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.పార్టీలో ఇద్ద‌రు ఎంపీలు ముర‌ళీమోహ‌న్‌….రాయ‌పాటి సాంబ‌శివ‌రావు లు తీవ్రంగా పోటీ ప‌డుతున్నారు. ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రికి టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌వి కాయం అనుకున్నారు అయితే బాబు మాత్రం ఇద్ద‌రు ఎంపీల‌కు చెవిలో పువ్వులుపెట్టారు.ఎంపీలు, ఎమ్మెల్యేలకు నామినేటెడ్‌ , కార్పొరేషన్ పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేశారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమని చంద్రబాబు ఖ‌రాకండీగా చెప్పారు. అన్ని అర్హతలు ఉండి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని వారికే కార్పొరేషన్, నామినేటెడ్‌ పదవులు ఇస్తామని తేల్చిచెప్పారు. దీంతో ఇద్దరు ఎంపీల ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. అయితే ఈనిర్ణ‌యం ఎంపీల సంగతి పక్కన పెడితే ప‌రోక్షంగా చంద్రబాబు తాజా నిర్ణయంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కంగుతిన్నారు.
పార్టీ పిరాయించిన కొంద‌రు ఎమ్మెల్యేలకు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌డంతో వారికి వ‌చ్చిన ఇబ్బందేమిలేదు.కానీ మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని ఆశించి బంగ‌ప‌డ్డ నాయ‌కుల‌లో ముఖ్యంగా జ్యోతుల నెహ్రూ,జ‌లీల్‌ఖాన్‌ల‌తోపాటు …నామినేటేడ్ ప‌ద‌వులు ఆశించి వాల్ల‌కు బాబు నిర్ణ‌యం మింగుడు ప‌డ‌టంలేదు. ఇక నుంచి పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల‌కు చుక్కులు క‌నిపించ‌డం ఖాయం.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -