Friday, May 10, 2024
- Advertisement -

సింగపూర్, జపాన్ చాలుగా.. చైనా ఎందుకు దండగ!

- Advertisement -

అంటే అన్నామంటారు కానీ.. చైనాతో ఇప్పుడు సంబంధాలు పెట్టుకునేందుకు బాబు ఎందుకు ఆరాటపడుతున్నారని.. కొందరు రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ లాంటి అంతర్జాతీయ కూటమిలో మన దేశానికి సభ్యత్వం రాకుండా.. మోకాలడ్డిన చైనాతో.. పెట్టుబడుల ఒప్పందాలు ఎంత వరకూ కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా చైనా వెళ్లిన చంద్రబాబు.. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి వేల కోట్ల ఎంవోయూ కుదుర్చుకుని వచ్చారు. అదే ఇప్పుడు అవసరమా అన్న చర్చ రాష్ట్రంలో జరుగుతోంది.

సింగపూర్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు పెట్టుబడులకు ముందుకు వస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుమానించాల్సిన పని లేదు. కానీ.. భద్రత పరంగా.. అభివృద్ధి పరంగా.. అడుగడుగునా అడ్డుకుంటున్న చైనా.. మన దేశంలో పెట్టుబడులకు ముందుకు వస్తే.. వెనక ఏదో దురుద్దేశం ఉండే ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు. ఇలాంటి దురుద్దేశాలకు ఏపీని వేదికగా చేయడం కూడా సరికాదని చెబుతున్నారు.

ఇదే విషయంపై ప్రధాని మోడీ కూడా కాస్త సీరియస్ గానే ఉన్నారని తెలుస్తోంది. చైనా వెళ్లి బాబు ఏంచేశారు.. ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న విషయంపైనా ఆరా తీస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు.. తన మాస్టర్ మైండ్ తో.. కేంద్రాన్ని కాకా పట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ గుసగుసల్లో నిజం ఎంతో.. అబద్ధం ఎంతో.. ఎవరో ఒకరు స్పందిస్తేనే తెలిసేది.

Related 

  1. చంద్రబాబు ని లెక్క చెయ్యని రేవంత్ రెడ్డి ! రెండు వర్గాలు గా చీలిపోయిన పార్టీ ?
  2. జగన్ , చంద్రబాబు ని తలదన్నేసిన కేటీఆర్
  3. టీ టీడీపీని.. బాబు వదిలేసినట్టేనా?
  4. బాబుకు అంత అవసరం ఏమొచ్చింది?
  5. మీడియాకు.. కేసీఆర్ ఫీవర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -