Monday, April 29, 2024
- Advertisement -

చంద్ర‌బాబు రెండు క‌ళ్ల సిద్దాంతం

- Advertisement -
AP CM Chandrababu Naidu play double Game on state bifurcation

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబునాయుడిని మించిన డ్రామా ఆర్టిస్టులు ఎవ‌రూ ఉండ‌రు. దీనికి కార‌నం బాబు ఆట్లాడుతున్న మాట‌లే నిద‌ర్శ‌నం..రాజ‌కీయాల‌కోసం ఎన్ని డ్రామాలైనా అడ‌తారు.నీతి,నిజాయితీ నాఇంటిపేరు అని చెప్పుకొనే బాబు ఇంత ఛీప్ రాజ‌కీయాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావ‌డంలేదు.చంద్రబాబు పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్‌కు అవతరణ దినోత్సవం లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవంబరు ఒకటో తేదీకి ఎంతటి ప్రాధాన్యం ఉండేదో తెలిసిందే.

న‌వ‌నిర్మాన్ దీక్ష‌పేరుతో చంద్ర‌బాబు రెండు నాల్క‌ల‌ధోర‌ని అవ‌లంభిస్తున్నారు.విజయవాడలో, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నవనిర్మాణ దీక్ష అట్టర్‌ఫ్లాప్‌ అయిందని సమాచారం. ఈ దీక్షకు జనం కరువైపోయారు. ఈ నవనిర్మాణ దీక్ష ఏమిటో, ఈ ప్రతిజ్ఞలు ఎందుకు చేయాలో జనాలకు అర్థం కావడంలేదు.
జూన్‌ రెండో తేదీ ఏపీకి చీకటి రోజని బాబు చాలా ఆవేదనగా చెప్పారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఏర్పాటు చేసిన రోజును తాను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. కాని ప్రజలు జీర్ణించుకున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడాలని, జరిగిన నష్టాన్ని గుర్తుకు తెచ్చుకొని అభివృద్ధి కోసం అంకితం కావాలన్నారు. పార్లమెంటు తలుపులు మూసి విభజన బిల్లును ఆమోదించారని, ఇటలీ స్వాతంత్య్ర దినోత్సవంనాడు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని విషాద గాథ వినిపించారు.ఆచీక‌టి రోజుకు తానే బాద్యున‌ని మాత్రం చెప్ప‌రు.

{loadmodule mod_custom,GA1}

రాష్ట్ర విభజన ఇష్టం లేనివాడైతే ‘రాష్ట్రాన్ని విభజిస్తే అభ్యంతరం లేదు’ అని రెండుసార్లు ఉత్తరాలు ఎందుకు ఇచ్చారు? తెలంగాణకు వెళ్లినప్పుడల్లా ‘నా వల్లనే తెలంగాణ వచ్చింది’ అని ఎందుకు చెప్పుకుంటున్నారు? రాష్ట్ర విభజన బాదాకరమైతే తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఎందుకు పాటించినట్లు?.అక్క‌డేమో నావ‌ల్ల‌నే తెలంగాణా వ‌చ్చిందంటారు….ఇక్క‌డ ఏపీలో మాత్రం చీక‌టిరోజని ముస‌లి క‌న్నీల్లు కారుస్తున్నారు.
విభజనను ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడకపోయినట్లయితే అందుకు వ్యతిరేకంగా ఆనాడే పోరాటం చేయాల్సింది. కాని ఆ పని చేస్తే తెలంగాణలో టీడీపీ ఉనికి ఉండదు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోసం, అక్కడి ఆస్తులు, వ్యాపారాలు కాపాడుకోవడం కోసం విభజనకు మద్దతు ఇచ్చారు.ఇప్పుడేమో పిట్ట‌క‌థ‌లు చెప్తారు.
రాజకీయ నాయకులంటేనే గొప్ప నటులు. నాటకాలడతారు. సినిమా చూపిస్తారు. హరి కథలు చెబుతారు. పిట్ట కథలు చెబుతారు. అర చేతిలో స్వర్గాలు చూపిస్తారు. వారికి తెలియని విద్య లేదు. ఈ విద్యల ప్రదర్శనకు జూనియర్లు, సీనియర్లనే తేడా లేదు. వినే ప్ర‌జ‌లు ఉన్న‌న్నాల్లు ఇలాంటి రాజ‌కీయ‌నాయ‌కుల పిట్ట‌క‌థ‌లు చెప్తూనే ఉంటారు…వాటిని ప్ర‌జ‌లు వింటానే ఉంటారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -