Sunday, May 5, 2024
- Advertisement -

ప్రతిపక్ష వైసీపీని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందా….?

- Advertisement -
AP CM Chandrababu Naidu Targeting YSRCP MLAs for Nandyal by Elections

రాజు త‌లుచుకుంటె కొర‌డా దెబ్బ‌లు క‌రువా అన్న‌ట్లుంది బాబు నైజం.నంద్యాల ఉప ఎన్నిక మొద‌ల‌య్యేస‌మ‌యానికి రాజ‌కీయం మరింత వేడెక్క‌నుంది. ఈ ఎన్నిక గెల‌వ‌క‌పోతే ఆపార్టీకి అక్క‌డ‌నుంచే ప‌త‌నం మొద‌లు కానుంది.అందుకే బాబు ప్రతిపక్షాన్ని దెబ్బతీసేందు పెద్ద‌ కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి అందరిలోనూ.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో పార్టీత‌రుపున నాయ‌కులు పాల్గొన‌కుండా టీడీపీ ప‌న్నాగాలు పండుతోంది.వైసీపీకి చెందిన ఎంఎల్ఏల్లో వీలైనంతమందిని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచే పన్నాగమేమైనా ఉందా అనుమానం కలుగుతోంది.ఎందుకంటె మొన్ననే చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసారు.

{loadmodule mod_custom,GA1}

సి రామాపురం గ్రామంలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డిపైన‌,గ్రామ‌స్తుల‌పైన‌ కేసు పెట్టాల్సిన అవ‌స‌రంలేదు.అయినా కేసు న‌మోదుచేయ‌డం గ‌మ‌న‌ర్హం.రాజధాని గ్రామాల్లో ఒకటైన పెనుమాకలో సిఆర్డిఏ అధికారులు గ్రామసభ నిర్వహించారు. సభలో వ్యక్తమైన అభిప్రాయాలను మినిట్స్ బుక్ లో రికార్డు చేయాలంటూ రైతులు, స్ధానికులు పట్టుబట్టటంతో గొడవ మొదలైంది. అభిప్రాయాలను రికార్డు చేయాలని కోర్టు ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. దాంతో మండిపోయిన రైతులు, స్ధానికులు టెంట్లను పీకేసి, కుర్చీలను విసిరేసారు.అంతే ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డిపై కేసు న‌మోదు చేశారు.
ఇక్కడే ప్రభుత్వ చర్యలపై అనుమానాలు మొదలయ్యాయి.నంద్యాల ఉపఎన్నికల సమయానికి వీలైనంతమంది వైసీపీ ఎంఎల్ఏపై కేసులు నమోదు చేయాలని అనుకుంటున్నట్లు కనబడుతోంది.ఎందుకంటే, నంద్యాల ఉపఎన్నికలు మొదలయ్యే సమయానికి వీలైనంతమంది ప్రతిపక్ష ఎంఎల్ఏలపై కేసులు నమోదు చేస్తే అవసరం వచ్చినపుడు అరెస్టులు చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. దాంతో ఉపఎన్నికల సమయంలో వైసీపీకి ఎంఎల్ఏలు ప్రచారం చేసే అవకాశం ఉండదు.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}sL4nrFh894w{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -