Saturday, April 27, 2024
- Advertisement -

రక్షణకు గార్డులు, కుక్కలు కాపలా.. వామ్మో ఆ మామిడి పండ్లకు ఇంత సెక్యూరిటా..!

- Advertisement -

సాధారణంగా సీజనల్ ఫ్రూట్స్ లో కింగ్ మేకర్ మామిడి కాయే . వేసవి వస్తే చాలు.. అంతా మామిడిని టేస్ట్ చేయకుండా ఉండలేరు. అయితే మామిడిలో ఎన్నో రకాలు ఉన్నాయి.. వాటిలో ఎంత మేలు రకమైన మామిడి అయినా.. ధర ఎంత ఉంటుంది? మహా అయితే ఓ 200 లేదా 400 రూపాయలు ఉండవచ్చు. కానీ.., ఒక కేజీ మామిడి ధర రూ.2.75 లక్షల అంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. సాధారణంగా మనకు మామిడి అనగానే మంచి టేస్ట్ తో కూడిన బంగిన‌ప‌ల్లి అని చెప్తాము. మామూలుగా మనదేశంలోనైతే వర్షాకాలం ఎంట్రీతోనే మామిడి కాయల సీజన్ ముగుస్తుంది.

కానీ ‘మియాజాకీ’ కథే వేరు. జపాన్ కు చెందిన ఆ మామిడి రకం.. అనూహ్య, ఆసక్తికర పరిస్థితుల్లో భారత దేశంలో మొలకెత్తాయి. రాణి, సంకల్ప్ పరిహార్ అనే జంట కొన్నేళ్ల క్రితం తాము రెండు మామిడి మొక్కలను పెంచామని, ఇవి సాధారణ మొక్కలే అనుకున్నామని చెప్పారు. ఆ చెట్లు పెరిగి పండ్లు కాయడం మొదలు పెట్టిన తర్వాత మామిడి పండ్లు రూబీ (కెంపు) రంగులోకి మారడాన్ని చూసి ఆశ్చర్యపోయాన్నారు వీటి గురించి ఆరా తీస్తే జపాన్ లో పండించే మియాజాకీ పండ్లని తెలిసిందని.. వాటి ధర 2 లక్షల 70 వేలకు అమ్ముడు పోయినట్టు గ్రహించామని పేర్కొన్నారు.

తాను రైల్లో చెన్నైకి వెళ్తుండగా ఓ వ్యక్తి రెండు మామిడి మొక్కలు ఇచ్చి తోటలో వీటిని పెంచుకోమన్నాడని, అయితే ఇవి మియాజాకీ మొక్కలని ఆ తరువాత తెలిసిందని ఆయన చెప్పారు. గత ఏడాది తమ తోటలోకి దొంగలు చొరబడి కొన్ని మామిడి మొక్కలను దొంగిలించుకుపోయారని , అప్పటి నుంచి ఈ తోటకు గార్డులను, కుక్కలను కాపలాగా పెట్టుకున్నామని ఈ జంట తెలిపారు. ఇంతటి ధ‌ర పెట్టి కొన‌డానికి వ్యాపారులు పోటీ పడుతుండటం విశేషం.

మ‌ధుమేహం ఉన్న‌వారు మామిడిపండ్ల‌ను తిన‌వ‌చ్చా …?

కుడివైపు తిరిగి పడుకుంటున్నారా..? అయితే ఖచ్చితంగా చదవండి..

ఎక్కువగా నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -