పెళ్లి తర్వాత అలాంటి పాత్రలో నటించనున్న కాజల్!

- Advertisement -

కాజల్ అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీలోదాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించి అత్యధిక పారితోషికం పొందుతున్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది.చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తరుణంలోనే తన బాల్య స్నేహితుడు వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. అయితే కాజల్ పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందని భావించారు. అందుకు భిన్నంగా కాజల్ పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తూనే నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ నిర్వహించి అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

పెళ్ళి తర్వాత కూడా ఈ బ్యూటీ జోరు ఏమాత్రం తగ్గడం లేదు.ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య మూవీలో చిరంజీవికి జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే కమల్‌ హాసన్‌ ఇండియన్‌-2 సినిమాలో నటిస్తోంది.వీటితో పాటు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాలో కాజల్ అగర్వాల్ భిన్నమైన పాత్రలో కనిపించబోతోంది.

- Advertisement -

Also read:అర్ధరాత్రి 12 గంటలకు విడుదల కానున్న ధనుష్ సినిమా..?

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న మూవీలో నాగార్జున రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈసినిమాలో కాజల్ ఒకవైపు గూడాచారి ,మరోవైపు వేశ్య ఈ రెండూ కలగలిపి ఉన్న పాత్రలో నటిస్తోంది. అంతే కాదు ఈ సినిమాలో కాజల్ మొదటి సారి కొన్ని యాక్షన్ సీన్స్ లో కనిపించబోతోంది. కాజల్ మొదటి సారి వేశ్య పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

Also read:మరోసారి నగ్నంగా రెచ్చిపోయిన కియారా.. ఫోటోలు చూస్తే?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -