- Advertisement -

స‌చివాల‌యంలో తొలిసారి సీఎం చైర్ పై వైఎస్‌ జగన్….

- Advertisement -

న‌వ్యాంధ్ర రెండో సీఎంగా స‌చివాల‌యంలో మొద‌టి సారి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అడుగు పెట్టారు. నిన్న సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జగన్, నేడు ఫస్ట్ టైమ్ సెక్రటేరియేట్ కు రానుండటంతో, పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.నేడు, రేపు ఆయన సచివాలయంలో ఉంటారని, పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని పార్టీ నేతలు ప్రకటించారు.

ఇప్పటికే సచివాలయంలో సీఎం చాంబర్‌ను సరికొత్తగా ముస్తాబు చేశారు. క్యాబినెట్ హాల్, హెలిపాడ్‌లతో పాటు సీఎం నేమ్ ప్లేట్‌, సీఎం కాన్వాయ్ రూట్లను సుబ్బారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.సీఎం చైర్ పై జగన్ తొలిసారి నేడు ఆసీనులు కానున్నారు. క్యాబినెట్ హాల్, హెలిపాడ్‌ లు, తాడేపల్లి నుంచి సచివాలయం వరకూ కాన్వాయ్ రూట్ సిద్ధమయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -