ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ’దిశ’ యాప్ పరిస్థితి ఇది…!

- Advertisement -

మహిళల భద్రతకై ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపటింది. ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకునేందుకు 2020 ఫిబ్రవరిలో దిశ యాప్‌ను ప్రారంభించింది. దిశ యాప్ ఎలా పనిచేస్తుంది.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలిఅనే అవగహన ప్రచారం బాగానే సాగింది.

అయినా ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ఉన్నాయి. మహిళల భద్రతకై ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ’దిశ’ యాప్ పై మహిళలలో అవగాహన కలిగించడం లో ప్రభుత్వం విఫలమైయిందని చెప్పాలి.

- Advertisement -

ఎందుకంటే గత వారంలో ఓ ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు కార్యకమంలో విజయనగరం కు చెందిన ఓ మహిళ బ్యాంక్ ఉద్యోగికి ఎదురైన ప్రశ్నే ఇందుకు నిదర్శణం అని చెప్పాలి. సెప్టెంబర్ 2వ తేది ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరులు హట్ సీట్ దక్కించు కుంది విజయనగరం కు చెందిన గౌతమి.

అయితే 6వ మరియు 20వేల రూపాయలన ప్రశ్న “వీటిలో, మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపోందించిన యాప్ పేరు ఏమిటి..? సమాదానలు A.నిషా B. మానస్ C. మదద్ D. దిశ ఉండగా సమాదానం తెలియక ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ వాడుకుంది. ఆడియన్స్ నుంచి కూడా A- 4%, B-26%, C-22%, D-48% సమాదానం వచ్చింది. అంటే ’దిశ’ యాప్ పై ప్రజలలో ఎంత వరకు అవగాహన ఉందో అర్థమౌతుంది.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళా మరియు ఉద్యోగికే మహిళల భద్రతకు సంబందించిన ’దిశ’ యాప్ పై అవగాహన లెకపోతే… సమాన్య మహిళలకు ఎంతవరకు అవగాహన ఉంటుందో అర్థమౌతుంది. ఇక్కడే ’దిశ’ యాప్ పై అవగాహనలో ప్రభుత్వం వైపల్యం కనిపిస్తుంది.
అవగహన కలిగించలేక పోతే ఎన్ని యాప్‍లు, ఎన్ని పోలీస్ సేష్టన్ లు పెట్టిన ఎమి లాభం…!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -