Thursday, May 16, 2024
- Advertisement -

తెలంగాణాకు కరెంట్‌ను నిపివేసిన ఏపీ జెన్‌కోఎట్రాన్స‌కో

- Advertisement -
AP Government power cut to Telangana

ఎప్పుడూ చంద్ర‌బాబ‌కు షాక్ ఇచ్చే కేసీఆర్‌కు ఇప్పుడు బాబు పెద్ద క‌రెంట్ షాక్ ఇచ్చారు.తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు తాము సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధిం బ‌కాయిల‌ను వెంట‌నే చెల్లించాల‌ని డిమాండ్‌చేసింది.

{loadmodule mod_custom,GA1}

ఇప్పటివరకు తాము సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించి రూ. 4, 449 కోట్ల బకాయి ప‌డింది.ఎన్ని సార్లు తెలంగాణా ట్రాన్స్‌కోకు నోటీస‌లు పంప‌నా స్పంద‌న లేక‌పోవ‌డంతో ఈరోజు నుంచి విద్యుత్ నిలిపివేస్తున్నామని తెలిపింది. ఈ బకాయి మొత్తం వెంటనే చెల్లిస్తే విద్యుత్ సరఫరా చేస్తామని ఏపీ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్.. స్పష్టం చేస్తూ తెలంగాణ ట్రాన్స్ కోకు లేఖ రాసింది.
తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని చెబుతూ 25న ఆఖరిసారి నోటీసులు పంపించింది. తెలంగాణ నుంచి సుమారు రూ.4,500వేల కోట్లు రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.ఏడాదికి రూ.1,128 కోట్ల చొప్పున ఇప్పటి వరకు రూ.4,449 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. అందులో రూ.1390 కోట్లు ఏపీనే తెలంగాణకు చెల్లించాల్సి ఉండటంతో దానిని మాఫీ చేసి రూ.3,138 కోట్లు చెల్లించాలని కోరింది.

{loadmodule mod_custom,GA2}

భారీ మొత్తంలో బిల్లులు పేరుకు పోవడంతో రోజువారీ ఆర్థిక కార్యకలాపాలను సైతం నిర్వహించడం కష్టంగా మారుతోందని జెన్ కో చెబుతోంది. దక్షిణాది రాష్ట్రాల లోడ్ డిస్పాచ్ సెంటర్ సహా కేంద్రం కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిలిపేసినట్లు తెలిపింది.ఇది తెలంగాణా ప్ర‌భుత్వానికి…కేసీఆర్‌కు పెద్ద దెబ్బేన‌ని చెప్ప‌వ‌చ్చు.ఈ బకాయి మొత్తం వెంటనే చెల్లిస్తేనే విద్యుత్‌ సరఫరా చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తూ తెలంగాణ ట్రాన్స్‌ కో అధికారులకు లేఖ రాసింది. మరి ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -