Friday, March 29, 2024
- Advertisement -

ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా జీత భత్యాలను ఫిక్స్ చేసిన ప్రభుత్వం

- Advertisement -

మంత్రి వర్గంలో స్థానం దక్కని రోజాకు నచ్చజెప్పిన జగన్ ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవిని ఇచ్చారు.
వైసీపీ అధికారంలోకి వస్తే… రోజాకి కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయ…

వైసీపీ అధికారంలోకి వస్తే… రోజాకి కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. నిజంగానే వైసీపీ అధికారంలోకి వచ్చినా.. రోజాకి మాత్రం మంత్రి పదవి కేటాయించాలేదు. ఈ విషయంలో రోజా బాగా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఎలాగోలా మంత్రి వర్గంలో స్థానం దక్కని రోజాకు నచ్చజెప్పిన జగన్ ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవిని ఇచ్చారు.

ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా జీతభత్యాలను ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఖరారు చేసింది. జీతభత్యాల కింద నెలకు రూ.3.82 లక్షలు కేటాయిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మొత్తంలో రూ.2 లక్షలను వేతనంగా పేర్కొనగా, వాహన సౌకర్యం కోసం రూ. 60 వేలు, ప్రభుత్వం కేటాయించిన అధికారిక క్వార్టర్స్‌లో నివసించకుంటే అద్దె చెల్లింపుల కోసం రూ. 50 వేలు, మొబైల్ ఫోన్ చార్జీలకు రూ. 2 వేలు, వ్యక్తిగత సిబ్బంది వేతనాలకు రూ. 70 వేలుగా నిర్ణయించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -