Friday, April 19, 2024
- Advertisement -

వైఎస్ వివేకా మృతిపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ ప్ర‌భుత్వం..

- Advertisement -

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై విచారణను ప్ర‌భుత్వం వేగ‌వంతం చేసింది. ఆయ‌న కేసును ప్ర‌త్యేకంగా విచారించేందుకు ప్రత్యేక బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. దనపు ఎస్పీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నామని క‌డ‌ప ఎస్పీ రాహుల్ దేవ్ శ‌ర్మా తెలిపారు.వివేకానందరెడ్డి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు.

ఇప్పటికే కుటుంబ సభ్యులు వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. వివేకా మృతిపై లోతుగా విచార‌ణ జ‌ర‌పాల‌ని ఇప్ప‌టికే కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున బాత్ రూంలో వివేకా మృతిచెందారు. అయితే ఆయన తలకు, చేతికి బలమైన గాయాలు అయినట్లుగా గుర్తించారు. రక్తపు మడుగులో పడి ఉన్న వివేకానందరెడ్డిని గుర్తించి పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -