Saturday, April 20, 2024
- Advertisement -

రాజధాని మార్పుపై వివరణ ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ…

- Advertisement -

రాజధాని అమరావతి నిర్మాణం పెనుభారం అవుతుందంటూ మూడు రోజుల క్రితం మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత బాబు అండ్ కో ఘాటుగా విమర్శలు చేశారు. రాజధాని ఎక్కడికి తరలించడం లేదని మంత్రులు క్లారిటీ ఇవ్వాలసి వచ్చింది. రాజధాని వ్యవహారం మరింత ముదరడంతో మంత్రి వివరణ ఇచ్చారు.

రాజధానిపై తాను చేసిన వ్యాఖ్యలు వక్రీకరించారని అన్నారు.రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకోలేదని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో తాను మాట్లాడింది వరదల గురించేనని తెలిపారు. గతంలో 12 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే అతలాకుతలమైందని, మొన్న 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని వెల్లడించారు.

చంద్రబాబు మాటలు చూస్తుంటే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాట్లాడుతున్నట్టే ఉందని వ్యాఖ్యానించారు. రాజధాని చుట్టూ బాబు బినామీలు భూములు కొన్నారు కాబట్టే ఈ విషయంలో వారంతా భయపడుతున్నారని అన్నారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని రాజధాని పేరుతో జరిగిన అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని బొత్స వివరించారు. అభివృద్ధి అంతా ఒక్క ప్రాంతానికే కాకుండా రాష్ట్రం అంతటా జరగాలని తాము కోరుకుంటున్నట్టు బొత్స స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో 25 లక్షల కోట్ల సంపద సృష్టించబోతున్నామని చెప్పారు.తనకు కోర్టు నోటీసులు ఇవ్వడంపై బొత్స స్పందించారు.. వోక్స్ వ్యాగన్ కేసులో నేను సాక్షిని మాత్రమే.. 60వ సాక్షిగా పిలిచారని క్లారిటీ ఇచ్చారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -