- Advertisement -

జ్యోతిష్యుడు చనిపోతావని చెబితే..ఉరేసుకుంది!

- Advertisement -

బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. యశ్వంతపుర ప్రాంతంలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న విద్యాజ్యోతి (29) ఆత్మహత్యకు పాల్పడింది. తొమ్మిది రోజుల క్రితమే ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకున్న ఆమె, జ్యోతిష్యుడి మాటలకు భయపడి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విద్యాజ్యోతికి ఓ జ్యోతిష్యుడు “నువ్వు ఎక్కువ కాలం భూమ్మీద బ్రతకలేవు” అంటూ భయపెట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమస్యల నివారణ కోసం తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయాలని సూచించిన అతను, చివరి రోజు అయిన శుక్రవారం తన తాళిని తీసి అమ్మవారికి సమర్పిస్తే శుభఫలితాలు ఉంటాయని చెప్పినట్లు సమాచారం.

జ్యోతిష్యుడి సూచనల ప్రకారం విద్యాజ్యోతి తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించింది. అయితే చివరి రోజు తాళిని తీసి సమర్పించే ముందు గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి తలుపులు బలవంతంగా తెరిచే సరికి ఆమె మృతి చెందినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. జ్యోతిష్యుడి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. మూఢనమ్మకాల వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అవసరమైతే మానసిక ఆందోళనలో ఉన్నవారు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -