Monday, May 13, 2024
- Advertisement -

దాన కేసులో లాలూకు 3.5 సంవ‌త్స‌రా శిక్ష‌, రూ 5ల‌క్ష‌ల జ‌రిమానాను ఖ‌రారు చేసిన రాంచీ సీబీఐ కోర్టు…

- Advertisement -

దానా స్కాం కేసులో ఎట్ట‌కేల‌కు బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్‌కు రాంచీ సీబీఐ కోర్టు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. దాదాపు 21 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొన‌సాగింది. లాలూతో పాటు స‌హా 15 మందిని రాంచీలోని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చిన విష‌యం తెలిసిందే. కొన్ని రోజులుగా దోషులంద‌రూ క‌స్ట‌డీలో ఉన్నారు. వారు ప్ర‌స్తుతం బిర్సా మండా సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు.

జార్ఖండ్‌లోని రాంచీ సీబీఐ ప్ర‌త్యేక కోర్టు జ‌డ్డి ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా శిక్ష‌కు ఖ‌రారు చేశారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కి 3.5 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా విధిస్తున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. మిగతా దోషులకు కూడా ఇదే శిక్షను విధించారు. దియోగర్‌ ట్రెజరీ నుంచి రూ.89.27లక్షలు అక్రమంగా డ్రా చేసిన కేసుకు సంబంధించి లాలూతోపాటు మరో 10 మందిపై కోర్టు విచారణ ఇప్పటికే పూర్తి చేసిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -