Friday, May 17, 2024
- Advertisement -

జగన్ పై పెద్ద కుట్ర.. అసలు కారణాలు ఇవే!

- Advertisement -
CBI files petition to cancel YS Jaganmohan Reddy’s bail

ఉన్నట్లుండి సీబీఐ ఎందుకు బెయిల్ ను రద్దు కోరింది.. అసలు కారణాలేంటి..? జగన్ పై  కుట్ర జరగుతోందా? దాంతో వైసీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. జగన్ జైలుకెళితే పార్టీని ఎవరు నడిపిస్తారు..? అన్న సందేహాలు పార్టీ నేతలు, కార్యకర్తల్లో కలుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బీజేపీయేనని అంటున్నారు.

గతంలో జగన్ జైలు కెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 16 నెలలు జగన్ జైలులో ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో విజయమ్మ ముందుండి నడిపించారు. ఇప్పడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందా? అవుతుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. బెయిల్ పై జగన్ బయటకు వచ్చి మూడేళ్లు అవుతోంది. ఇన్నాళ్లూ సాక్షులను ప్రభావితం చేయని జగన్ ఇప్పుడు ప్రభావితం చేస్తారని సీబీఐ అంటోంది. జగన్ దాదాపు మూడు నెలల నుంచి తన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను జూన్ నెలలో రాజీనామా చేయిస్తానని పదేపదే చెబుతున్నారు.

ప్రత్యేక హోదా ను కేంద్రం ఇవ్వనందుకు నిరసనగా తమ ఎంపీలు వచ్చే జూన్ నెలలో రాజీనామా చేస్తారని జగన్ చెప్పిన తర్వాతే వేగంగా పరిణామాలు మారాయంటున్నారు విశ్లేషకులు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడం వల్ల జాతీయ స్థాయి అంశం అవుతుంది. దాంతో అది పెద్ద చర్చకు దారితీస్తోంది. మోడీ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్న విషయం దేశవ్యాప్తంగా తెలిసిపోతోంది. ఇది నచ్చకనే కొందరు సీబీఐ పై వత్తిడి తెచ్చి జగన్ బెయిల్ ను రద్దు చేయించేలా ప్లాన్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బీజేపీతో టీడీపీ కలిసి ఎన్నికలకు ముందు జగన్ బయట ఉండటం తమకు శ్రేయస్కరం కాదని.. కేంద్రంతో మాట్లాడి ఈ పని చేయించినట్లు వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద సీబీఐ జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.

{youtube}_Nm-zcAykwI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -