బ్లాక్ మనీ ని రూపు మాపడం కోసం పెద్ద నోట్లు రద్దు చేసాం అని మోడీ చెబుతున్నా జనం నమ్మని పక్షం లో ఈ ప్రచారం మొత్తం నిజం చెయ్యాలి అనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు చెబుతున్నారు.
నల్లదనం కట్టడి చేసి దేశ వ్యాప్తంగా బ్లాక్ మనీ అనేది లేకుండా చెయ్యడం దగ్గర నుంచీ ప్రతీ లావాదేవీ పెర్ఫెక్ట్ గా ఉండాలి అనేది నేతలు వేస్తున్న ప్లాన్. ఒక కొత్త పథకం ద్వారా.. గృహనిర్మాణ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వటంతో పాటు.. సామాన్యుడు సొంతింటి కలను నిజం చేసుకునేందుకు వీలుగా కేంద్రం కొత్త పథకాన్ని తీసుకురావాని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ పథకంలో గృహ రుణాన్ని కేవలం 6 నుంచి 7 శాతం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. యాభై లక్షల వరకూ రుణం ఇవ్వడం వీలుగా ఈ పథకం రాబోతోంది అంటున్నారు. ఈ అత్యల్ప వడ్డీరేట్లు తొలిసారి ఇంటిని కొనుగోలు చేసే వారికి మాత్రమే వర్తింపచేసేలా చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దుకారణంగా వచ్చేలాభాన్ని కేంద్రం ఈ రూపంలో ప్రజలకు అందించాలని భావిస్తోంది.
