- Advertisement -

చివ‌రికి కేశ‌వ‌రెడ్డి విధ్యార్థుల బాధితుల‌తో డీల్ కుదుర్చుకున్న బాబు..

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర మం‍త్రులు, సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం నంద్యాలలో మకాం వేశారు. విద్య‌ను కూడా త‌న రాజ‌కీయానికి వాడుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో టీడీపీ మరో దిగుజారుడు ఫార్ములాను అనుసరించింది. కేశవరెడ్డి అప్పుల్లెగ్గొట్టిన ఫైనాన్షియర్లకు అధికార పార్టీ ఎర వేసింది. నిన్నరాత్రి సీఎం పర్యటన నేపథ్యంలో ఫైనాన్షియర్లతో టీడీపీ నేతలు మంతనాలు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.
నంద్యాల పర్యటనలో శనివారం అర్ధరాత్రి తర్వాత నంద్యాల గెస్ట్ హౌస్ లో చంద్రబాబునాయుడు సమక్షంలోనే ఆ ముచ్చట జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు నంద్యాలలో చంద్రబాబు రాత్రి బస చేయాలన్న నిర్ణయం వెనుక ఇదే ప్రధాన కారణంగా నేతలే చెబుతున్నారు. ఆ డీల్ లో కూడా కేశవరెడ్డి బాధితులే ఎక్కువున్నట్లు సమాచారం.
కేశవరెడ్డి విద్యాసంస్ధల అధినేత కేశవరెడ్డి తన విద్యాసంస్ధల్లో చదివే తల్లి, దండ్రుల నుండి దాదాపు రూ. 800 కోట్ల మేర డిపాజిట్లు సేకరించి తర్వాత జెండా ఎత్తేసిన పెద్దమనిషి. ఆయన బాధితులతోనే ఇపుడు టిడిపి డీల్ కుదుర్చుకుంటోందట.
కేశవరెడ్డి బాధితులు నియోజకవర్గంలో సుమారు 30 వేలమంది ఉన్నారట. అన్ని వేలమంది అంటే మాటలా? అందుకే ఉపఎన్నికల ప్రచారంలో మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రచారానికి వెళ్ళిన చోటల్లా బాధితులు మంత్రిని నిలదీస్తున్న సంగతి తెలిసిందే కదా? ముందు కేశవరెడ్డి నుండి తమ డబ్బు ఇప్పించి తర్వాతే ఓట్లు అడగటానికి రావాలంటూ జనాలు మంత్రిని నిలదీస్తుండటంతో మంత్రికి దిక్కుతోచలేదు.ప్ర‌చారంలో కేశవరెడ్డి, ఆదినారాయణరెడ్డి స్వయానా వియ్యంకుల్లేండి. అందుకే మంత్రికి బాధితులు చుక్కలు చూపిస్తున్నారు. అయితే, ఇదే విషయాన్ని నంద్యాల నేతలు చంద్రాబాబు దృష్టికి తీసుకెళ్ళారట.
అక్కడి నుండే వ్యూహరచన మొదలైంది. కేశవరెడ్డి బాధితుల్లో వివిధ వర్గాల్లో గట్టి వాళ్ళెవరో ముందు గుర్తించాలని చంద్రబాబు ఆదేశించారట. అటువారిలో కొందరిని టిడిపి నేతలు శనివారం అర్ధరాత్రి తర్వాత గెస్ట్ హౌస్ కు తీసుకొచ్చి చంద్రబాబుతో కలిపారట.కేశవరెడ్డి తమవద్ద తీసుకున్న మొత్తాలు, వాటికైన వడ్డీ తదితరాలను బాదితులు సిఎం దృష్టికి తీసుకెళ్ళారట. దాంతో వారి డబ్బులన్నీ టిడిపి ఇచ్చేట్లు వారందరూ టిడిపి గెలుపుకు కృషి చేసేట్లుగా మాటలు జరిగాయని స్ధానిక నేతలే చెబుతున్నారు. చివ‌రికి విద్య‌ను కూడా త‌న స్వార్థ‌రాజ‌కీయానికి ఎలా ఉప‌యేగించుకుంటున్నారో చంద్ర‌బాబుగారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -