Sunday, May 5, 2024
- Advertisement -

విక్రమ్ ల్యాండ్ గురించి సోషల్ మీడియాలో ఫేక్…అసలైన నిజాలు ఇవి..

- Advertisement -

ఐస్రో చేపట్టిన ప్రతీష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్ 2 పై ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆసక్తి నెలకొందో అందరికి తెలిసిందే. ప్రాజెక్టులో విక్రమ్ ల్యాండింగ్ ను చూసేందుకు ఈనెల 7న వేకువజామువరకు టీవీలకు అతుక్కుపోయారు.అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. ల్యాండింగ్ చివరి దశలో విక్రమ్ తో సంబంధాలు తెగిపోవడంతో అందరూ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

సెప్టెంబర్ 7, 2019న చంద్రయాన్ రెండో మిషన్‌లో భాగంగా విక్రమ్ రోవర్ 2.1 కి.మీ దూరంలో కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే ఇస్రో చైర్మన్ కె. శివన్ మాత్రం విక్రమ్ రోవర్ లొకేషన్‌ను గుర్తించామని, అయితే హార్డ్ ల్యాండింగ్ కారణంగా సిగ్నల్స్ కోల్పోయామని ప్రకటించారు. అయితే త్వరలోనే విక్రమ్ నుంచి సిగ్నల్స్ అందుకునే అవకాశం ఉందని, శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇదిలాఉంటే సోషల్ మీడియాలో మాత్రం కొన్ని ఫేక్ న్యూస్ లు వైరల్ గా మారాయి. ఇప్పటికే ఇస్రో చైర్మన్ శివన్ పేరిట ఫేక్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి విక్రమ్ రోవర్ ఆచూకీ దొరికింద అంటూ అవాస్తవ వార్తలు వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న చంద్రుడి ఉపరితలం ఫోటోలు చంద్రయాన్ 2 విక్రమ్ రోవర్‌వి కావని అవన్నీ నాసా ప్రయోగించిన అపోలో 15కు సంబంధించిన చిత్రాలని ఇస్రో నిపుణులు పేర్కొంటున్నారు.

మరో వైపు ట్విట్టర్ వేదికగా అత్యుత్సాహంతో ఫేక్ ఫోటీలోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.దీనిపై ఇస్రో సైంటిస్టు ఒకరు స్పందిస్తూ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటోలు వాస్తవం కాదని, విక్రం ల్యాండ్ రోవర్ ఆచూకీ గుర్తించేందుకు మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపారు.

https://twitter.com/BALRAJVETRI/status/1170631337784426501

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -