Friday, April 19, 2024
- Advertisement -

జగన్ అప్పులు.. రాష్ట్రం తిప్పలు !

- Advertisement -

దేశంలో ప్రస్తుతం అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా వైఎస్ జగన్ అదికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అప్పుల చిట్టా మరింత పెరిగిపోయింది. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలను కూడా వెనక్కి నెట్టి ఆంధ్ర ప్రదేశ్ అప్పుల జాబితాలో ముదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా సి‌ఎం జగన్ సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వ సొమ్మును ధారాళంగా ఖర్చు చెస్తూ ఉండడంతో అప్పులు పెరిగిపోతున్నాయి. కానీ సి‌ఎం జగన్ పథకాలు ప్రవేశ పెడుతున్నప్పటికి అభివృద్ది మాత్రం రాష్ట్రంలో కనిపించడం లేదు.

దీంతో అప్పులు తీసుకుంటున్న దానికి ఫలితం మాత్రం కనిపించకపోవడంతో ప్రతిపక్షాల నుంచి మాత్రమే కాకుండా ప్రజల నుంచి కూడా సి‌ఎం జగన్ పాలనపై వ్యతిరేకత ఎదురౌతుంది. ఇలా రాష్ట్ర ఆదాయాన్ని మించి అప్పులు తీసుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది అని తెలిసినప్పటికి జగన్ మాత్రం అప్పులు తీసుకునే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ఆదాయంలో 14 శాతం కేవలం తీసుకున్న అప్పుల వడ్డీ కట్టేందుకే వెళుతోందట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సి‌ఎం జగన్.. ఏ స్థాయిలో అప్పులు తీసుకుంటున్నారనే విషయం.

మరి రాష్ట్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ది కూడా కనిపించక పోవడంతో.. రిజర్వు బ్యాంక్ వద్ద తీసుకున్న అప్పు జగన్ ఏంచేస్తున్నారనే ప్రశ్నలను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో 1000 కోట్ల రూపాయల అప్పు కోసం రిజర్వ్ బ్యాంక్ వద్ద ఇండెంట్ పెట్టింది. సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి ఈ అప్పును రాష్ట్రప్రభుత్వం సేకరించనుంది. ప్రస్తుతం ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు తీసుకున్న అప్పులనే రాష్ట్రప్రభుత్వం ఇంకా పూర్తిగా చెల్లించలేదు.. ఈ నేపథ్యంలో మళ్ళీ అప్పుతీసుకునేందుకు జగన్ సర్కార్ రిజర్వ్ బ్యాంక్ వద్ద ఇండెంట్ పెట్టింది. దీంతో మరో సారి రాష్ట్రంలో నిత్యవసర ధరల మోత మోగే అవకాశం ఉందంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బాబు చూపు .. బీజేపీ వైపు ?

పవన్ కలవరం.. అందుకేనా ?

విశాఖ కేంద్రంగా.. జగన్ ప్లాన్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -