Sunday, May 12, 2024
- Advertisement -

ఊళ్లో పెళ్లికి కాంగ్రెస్ హడావుడి ఎక్కువైంది..!

- Advertisement -

ఏపీ ప్రత్యేక హోదా అంశం గురించి కాంగ్రెస్ పార్టీ రచ్చ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అటు  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్.. ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలుగా విడిపోయి కాంగ్రెస్ నేతలు ఈ అంశం గురించి దూషణలకు దిగుతున్నారు. విమర్శలు చేసుకొంటున్నారు. ఇక్కడ విడ్డూరం ఏమిటంటే..

ప్రత్యేక హోదా అంశం గురించి వీళ్లకు ఎలాంటి అధికారాలు  లేవు! దాన్ని ఏపీకి తెచ్చిపెట్టే శక్తీ లేదు.. దాన్ని రానీయకుండా అడ్డుకొనేంత సీనూ లేదు! అయినా కాంగ్రెస్ నేతలు ఈ అంశం గురించి మాట్లాడుతున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు లేదంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి.దీని వల్ల తెలంగాణకు నష్టం అని.. అంటూ ఆయన ప్రధానికి వివరించాడట. మరి గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పాడని చెప్పి ప్రధానమంత్రి ఏపీ ప్రత్యేక హోదా అంశం గురించి నిర్ణయం తీసుకోకపోవచ్చు. అయినా కూడా ఆయన ఎందుకు ఈ అంశం గురించి జోక్యం చేసుకొన్నాడనేదే అర్థం కావడం లేదు!

ఇక ఈ అంశం గురించి తెగ ఫీలవుతున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి. గుత్తా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం పట్ల రఘువీరారెడ్డి అభ్యంతరం చెప్పారు. ఆయన తీరును ఖండించారు. ఈ విషయంలో ఆయనపై అధినేత్రి సోనియాగాంధీకి కూడా ఫిర్యాదు చేశారీయన. మరి ఆమె చెబుతుంది? గుత్తా లేఖను వెనక్కుతీసుకొమ్మని చెబుతుందా?! అయినా కాంగ్రెస్ పార్టీ నేతల తీరును చూస్తుంటే.. ఇదంతా ఊళ్లో పెళ్లికి వీళ్లు హడావుడి చేసినట్టుగా ఉంది కానీ.. అంతకు మించి ఏమీ లేదు.అంతిమంగా ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేదే తప్ప మరోటి కాదు కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -