Monday, April 29, 2024
- Advertisement -

భాగ్యనగరం బెంబేలు.. మహమ్మారి విజృంభణ..!

- Advertisement -

తెలంగాణ లో కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. తాజాగా 337 మందికి వైరస్ సోకింది. జీహెచ్​ఎంసీ పరిధిలో 91 మంది మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 3,03,455కు పెరిగింది.

వైరస్‌కు మరో ఇద్దరు బలయ్యారు. ఇప్పటివరకు మహమ్మారితో 1,671 మంది మరణించారు. తాజాగా 181 మంది బాధితులు డిశ్చార్జ్​ అయ్యారు. ఇప్పటివరకు 2,98,826 మంది కొవిడ్​ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,958 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రస్తుతం 1,226 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న 37,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

దేశంలో కొవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా 46,951 వేల మందికి వైరస్​​ సోకింది. మరో 212 మంది చనిపోయారు. 21,180 వైరస్​ నుంచి కోలుకున్నారు.

దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల 50 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.కొవిడ్​ వ్యాప్తి కట్టడిలో భాగంగా సోమవారం ఒక్కరోజే 8,80,655 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్​ టెస్ట్​ల సంఖ్య 23 కోట్ల 44 లక్షల దాటింది.

స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు

టాలీవుడ్ ని ఏలేస్తున్న ఈ కుర్రాడో ఎవరో తెలుసా?

‘ఆట నాది, రూ.కోటి మీది’ అంటూ.. ఎన్టీఆర్ లేటెస్ట్ ప్రొమో!

కోహ్లీ పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు.. నిన్నటి మ్యాచ్ లో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -