Thursday, April 25, 2024
- Advertisement -

కోహ్లీ పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు.. నిన్నటి మ్యాచ్ లో..!

- Advertisement -

టీమ్​ఇండియా నయా ఓపెనర్లు రోహిత్ శర్మ, కోహ్లీ కలిసి ఇంగ్లాండ్​తో చివరి టీ20లో అదరగొట్టారు. నిర్ణయాత్మక మ్యాచ్​లో గెలిచి సిరీస్​ సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఒకవేళ జట్టుకు అవసరమైతే భవిష్యత్తులోనూ విరాట్​తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెడతానని హిట్​మ్యాన్ అన్నాడు. ఇంగ్లాండ్​తో మ్యాచ్​ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.

ఈ బ్యాటింగ్​ ఆర్డర్​తో మ్యాచ్​ గెలవడం ఆనందంగా ఉంది. అయితే మ్యాచ్​కు ముందు కెప్టెన్​ ఏం ఆలోచిస్తాడో దానినే మేం ఆచరణలో పెడతాం. ఒకవేళ కోహ్లీ నాతో ఓపెనింగ్ చేయడం జట్టుకు మంచిదనిపిస్తే.. అలానే కొనసాగిస్తాం. అయితే వన్డే సిరీస్​లో విరాట్ ఓపెనర్​గా వస్తాడని అనుకోవట్లేదు” అని రోహిత్ చెప్పాడు.”టీ20 ప్రపంచకప్​నకు ఇంకా చాలా సమయముంది. అందులో ఆడే జట్టు గురించి ఇప్పడే మాట్లాడటం సరికాదు.

ఈ మ్యాచ్​లో ఎక్స్​ట్రా బౌలర్​ కోసం బ్యాట్స్​మన్ కేఎల్ రాహుల్​ను తప్పించాం. అయితే అతడు జట్టులో కీలక సభ్యుడు. వరల్డ్​కప్​లో ఎవరెవరు ఉండాలనే విషయం మేనేజ్​మెంట్​ చూసుకుంటుంది” అని రోహిత్ తెలిపాడు.శనివారం జరిగిన చివరి టీ20లో ఇంగ్లాండ్​పై భారత్ 36 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్​ను 3-2 తేడాతో సొంతం చేసుకుంది. ఈనెల 23న పుణెలో ఇరుజట్లు తొలి వన్డే ఆడనున్నాయి.

అందుకే నిరుద్యోగం పెరుగుతుంది: రాహుల్ గాంధీ

ఐఎస్​ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్​లో భారత్ కి స్వర్ణం..!

ఒక వైపు ఆట.. మరో వైపు కరోనా కాటు..!

సురభి వాణీదేవి గెలిచాక మాటలు ఇలా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -