Friday, May 3, 2024
- Advertisement -

ఐకియా స్టోర్‌లో పుడ్ఏదైనా పురుగు కామ‌నే ….

- Advertisement -

హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌ (ఫుడ్‌కోర్టు) మరోసారి చిక్కుల్లో పడింది. ఫుడ్ ఏదైనా పురుగు కామ‌న్ అయ్యింది. తాజాగా ఓ చాక్లెట్ కేక్‌లో పురుగు రావడం మరోసారి కలకలం రేపింది. తాము ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్‌లో బతికున్న పురుగు వచ్చిందని కొన్ని రోజుల కిందట ఫిర్యాదు చేసిన కస్టమర్, ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయడంతో అధికారులలో కదలిక వచ్చింది. దాదాపు మూడు వారాల కిందట వెజ్ బిర్యానీలో గొంగళిపురుగు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

కిషోర్‌ అనే కస్టమర్‌ ఈ నెల 12న తన కూతురితో కలిసి ఐకియా రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఆ సమయంలో కిషోర్‌ కూతురు చాక్లెట్‌ కేక్‌ని ఆర్డర్‌ చేసింది. తీరా కేక్‌ని తీసుకొచ్చాక చూస్తే దాని మీద ఓ పురుగు పాకుతుంది. ఇది గమనించిన కిషోర్‌ తన ఆర్డర్‌ కాపీ, బిల్‌ పే చేసిన కాపీతో పాటు చాక్లెట్‌ మీద ఉన్న పురుగును కూడా వీడియో తీసి మున్సిపల్‌ అధికారులకు, హైదరాబాద్‌ పోలీస్‌లకు ట్యాగ్‌ చేశాడు.

వారం రోజులు వేచి చూసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేక్ నుంచి పురుగు వచ్చిన వీడియోను పోస్ట్ చేశాడు. ఇది గమనించిన జీహెచ్‌ఎంసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిగిన దానిపై చర్యలు తీసుకున్నారు.

స్వీడన్‌కు చెందిన కంపెనీకి 5 వేల రూపాయల జరిమానా విధించారు. కొన్ని రోజుల కిందట మొహమ్మద్ అనే కస్టమర్‌కు వెజ్ బిర్యానీలో పురుగు రావడంపై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఐకియా నిర్వాహకులకు 11,500 రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -