Saturday, May 4, 2024
- Advertisement -

ఉత్తరాంధ్రలో నేడు అతి భారీ వర్షాలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న రోను తుపాను శుక్రవారం నాడు తీవ్ర రూపం దాల్చనుందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రోను తుపాను విశాఖకు 110 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ తీరం వెంబడి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అన్ని ఓడరేవుల్లోనూ 4 నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం తీవ్ర తుపానుగా మారి శుక్రవారం నాడు ఒడిసా వైపు వెళ్లనుంది. శనివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్ లో ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వాన కురుస్తోంది. ఇక్కడ అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్రంలో అలలు ఎగిసిఎగిసి పడుతున్నాయి. జిల్లాలోని రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టటర్ ఆదేశించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -