Friday, March 29, 2024
- Advertisement -

రాజకీయంగా మారిన వరదలు.. టి‌ఆర్‌ఎస్ కు చెక్ ?

- Advertisement -

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో చాలా ప్రాంతాలు వరదలకు గురి అయ్యాయి. ఇక వరదలకు గురి అయిన ప్రాంతాలపై ఫోకస్ చేస్తూ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇటీవల వరద ప్రాంతాలను. సందర్శించిన తెలంగాణ సి‌ఎం అన్నీ రకాల సహాయక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం అయిందని బీజేపీ ఆరోపిస్తోంది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో సంభందం లేకుండా సహాయక చర్యలు చేపట్టేందుకు కేంద్రం సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో టి‌ఆర్‌ఎస్, బీజేపీ మద్య ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. .

అయితే వరదల విషయంలో చిత్త శుద్ది లేదని, గతంలో వరదలు సంభవించినప్పుడు కూడా కేంద్రప్రభుత్వం ఎలాంటి నిదులు అందించలేదని టి‌ఆర్‌ఎస్ ఆరోపిస్తుంటే.. నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అయిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంచితే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ నానాటికీ బలపడుతోంది..ఈ నేపథ్యంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందే ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టి తెలంగాణ ప్రజలకు బీజేపీ ని మరింత దగ్గర చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.

అందులో భాగంగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, అలాగే బండి సంజయ్ ఇటీవల అమిత్ షా ను కలిసి వరద పరిస్థితులను వివరించగా.. నష్టాన్ని అంచనా వేసి సహాయక చర్యలు చేపట్టేందుకు ఒక కమిటీని తెలంగాణకు పంపేందుకు అమిత్ షా వెంటనే నిర్ణయం తీసుకున్నట్లు బండి సంజయ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీన్ని బట్టి చూస్తే టి‌ఆర్‌ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టడంలో టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని, కానీ బీజేపీ ముంపు ప్రాంతాలను అన్నీ విధాలుగా ఆదుకుందని ప్రజల్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నంగా అమిత్ షా ప్లాన్ అని తెలుస్తోంది. దీన్ని వచ్చే ఎన్నికల ప్రచారల్లో బలంగా వినిపించే ప్రయత్నం చేస్తారు కమలనాథులు. మరి టి‌ఆర్‌ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ వెస్తోన్న ఈ ప్రణాళికలు ఎంతవరకు సక్సస్ అవుతాయో చూడాలి.

More Like This

ఆ ముగుర్లో మునుపటి జోష్ ఏది ?

విభజన పోలిటిక్స్ .. మళ్ళీ తెరపైకి ?

కే‌సి‌ఆర్ కాంగ్రెస్ కు మద్దతిస్తాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -