Friday, April 26, 2024
- Advertisement -

లాక్ డౌన్ చాలా నేర్పించింది : రవితేజ

- Advertisement -

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో ఎంతో సతమతమైంది. కరోనా తో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా ఎంటర్ టైన్ మెంట్ రంగం పూర్తిగా స్తంభించిపోయింది. సినీ రంగంపై కరోనా ప్రభావం బాగా చూపించింది. అన్ని భాషా చిత్రాలకు సంబంధించి షూటింగ్ పూర్తిగా ఆగిపోయాయి. ఈ మద్యనే మళ్లీ షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. లాక్ డౌన్ సమయంలో సినీ సెలబ్రెటీలు ఇంటికే పరిమితం అయ్యారు.

ప్రస్తుతం మాస్ మహరాజ రవితేజ ‘క్రాక్’ చిత్రంలో నటిస్తున్నారు. మలినేని గోపిచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా రవితేజ మీడియా చిట్ చాట్ లో ముచ్చటించారు. ఇక లాక్ డౌన్ సమయంలో తాను ఎంతో నేర్చుకున్నా అని.. కుటుంబ సభ్యులతో పూర్తిగా గడిపానని అన్నారు.

ఈ సమయంలో ఎన్నో సినిమాలు చూసే అవకాశం దక్కిందని.. వాటి నుంచి ఎంతో నేర్చుకున్నా అన్నారు. అంతే కాదు మనిషి మనుగడకు ఇలాంటి అవాంతరాలు వస్తే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో కళ్లారా చూశా అన్నారు. ఇక తన పిల్లలు టెక్నాలజీ పరంగా మంచి ప్రావిణ్యం సంపాదించారని.. సోషల్‌మీడియాకు సంబంధించి కొత్త విషయాల్ని వారి నుంచి నేర్చుకున్నా అన్నారు. నిజంగా చెప్పాలంటే ఒక్క నిమిషం కూడా బోర్‌గా ఫీల్‌ కాలేదు’ అని చెప్పుకొచ్చాడు. 

టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా ?

అమల గురించి లైఫ్ సీక్రెట్స్..!

ఈ హీరోయిన్స్ చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తున్నారు..!

సొంత మరదల్ని పెళ్లి చేసుకున్న హీరోలు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -