Monday, April 29, 2024
- Advertisement -

అతివలకి గొప్ప ఉద్యోగ అవకాశం.. ఇదే తొలిసారి..!

- Advertisement -

భారత నారీశక్తి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్​డీఆర్​ఎఫ్​)లోకి తొలిసారిగా మహిళలకు ప్రవేశం లభించింది. 100 మందికిపైగా అతివలతో కూడిన మొదటి బృందం విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొని ఈ దళంలో చేరింది. ప్రస్తుతం ఈ బృందాన్ని ఉత్తర్​ప్రదేశ్​లోని గఢ్​ ముక్తేశ్వర్​ పట్టణంలో గంగా నది ఒడ్డున అత్యవసర విధుల నిర్వహణ కోసం మోహరించారు. వీరు సహాయ పడవలు, ఇతర సాధన సంపత్తిని నిర్వహిస్తున్నారని ఎన్​డీఆర్​ఎఫ్​ డైరెక్టర్​ జనరల్​ ఎస్.ఎన్​. ప్రధాన్​ తెలిపారు.

విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడానికి అవసరమైన అన్ని రకాల నైపుణ్యాలను వీరు కలిగి ఉన్నారని చెప్పారు ప్రధాన్​. ముఖ్యంగా మహిళలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. సమీప భవిష్యత్​లో ఈ దళ బలాన్ని 200కు పెంచనున్నట్లు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -