- Advertisement -

ఎపి కాంగ్రెస్ నేత దేవినేని హెచ్చరిక

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ ను నీళ్లు లేని ఎడారిలా మారుస్తోందని ఎపి కాంగ్రెస్ నాయకుడు దేవినేని నెహ్రు విమర్శించారు. ఎగువన ఉన్న తెలంగాణ నీటిని అడ్డుకునేందుకు పన్నాగాలు పన్నుతూంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకుంటున్నారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రాజుక్టులపై విజయవాడలో ఎపి కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న దేవినేని నెహ్రు మాట్లాడుతూ దిగువనున్న ఆంధ్రప్రదేశ్ కు నీరు వచ్చే పాలమూరు, డిండి ప్రాజెక్టుల్లో నీటిని తోడేస్తున్నారని అన్నారు.

తెలంగాణ మంత్రి హరీష్ రావ్ ధర్నా చేసిన వారికి వార్నింగులు ఇస్తున్నారని, ఆంధ్రా మొత్తం ధర్నా చేస్తే హరీష్ రావు తన తొమ్మిది జిల్లాల్లోనూ తిరగలేరని ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి తీరతామని తెలంగాణ సర్కార్ ఛాలెంజ్ చేస్తోందని, ఈ ధోరణి వారికి మంచిది కాదని ఆయన అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -