- Advertisement -

శివాలయం..దేవుడికే ఆఫర్ ఇచ్చాడు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శివాలయంలో హుండీ లెక్కింపులో ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. హుండీని తెరిచి లెక్కిస్తున్న సమయంలో నగదు, నాణేలతో పాటు ఒక లేఖ బయటపడింది. ఆ లేఖలో గుర్తు తెలియని వ్యక్తి శివుడికి ఓ ప్రత్యేక ‘ఆఫర్’ ఇచ్చినట్లు ఉంది.

తాను పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని, ఏడాదికి రూ.20 లక్షల ప్యాకేజీ వచ్చే ఉద్యోగం రావాలని ప్రార్థించిన భక్తుడు, తన కోరిక నెరవేరితే శివుడికి ప్రత్యేక అభిషేకం చేయించి వస్త్రాలు సమర్పిస్తానని లేఖలో పేర్కొన్నాడు. ఇది తన మొదటి మరియు అత్యంత ముఖ్యమైన కోరిక అని భావోద్వేగంగా రాసి హుండీలో వేసినట్లు తెలుస్తోంది.

హుండీ లెక్కింపులో ఈ లేఖ బయటపడటంతో ఆలయ సిబ్బంది, భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. భక్తి భావంతో రాసిన ఈ లేఖ ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దేవుడిపై నమ్మకం ఉంచి తన భవిష్యత్తు కోసం ప్రార్థించిన యువకుడి మనసు పలువురిని ఆకట్టుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -