- Advertisement -
కర్ణాటకలో సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయారు బీజేపీ ఎంపీ భార్య. డిజిటల్ అరెస్టు పేరిట కర్ణాటక బీజేపీ ఎంపీ కె.సుధాకర్ భార్య వద్ద రూ.14 లక్షలు కాజేశారు దుండగులు.
కర్ణాటక చిక్‌బళ్లాపూరు ప్రాంతంలో తన పత్రాలు వాడి సాధ్బత్ ఖాన్ అనే వ్యక్తి క్రెడిట్ కార్డు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డాడని, అతన్ని అరెస్టు చేస్తే మీ పేరు చెప్పాడని బీజేపీ ఎంపీ కె.సుధాకర్ భార్య ప్రీతికీ ఫోన్ చేశారు సైబర్ నేరగాళ్లు
రూ.14 లక్షలు చెల్లించకపోతే అన్ని డిజిటల్ ఖాతాలు బ్లాక్ చేస్తామని, పంపిన డబ్బులు తిరిగి రీఫండ్ చేస్తామని చెప్పారు దుండగులు. రూ. 14 లక్షలు పంపగానే ఫోన్ కట్ అవ్వడంతో, మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు ఎంపీ భార్య ప్రీతి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
