Saturday, April 20, 2024
- Advertisement -

అమెరికాలో కాల్పుల కలకలం

- Advertisement -

ప్రపంచం అంతా కరోనా వైరస్ తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గత ఏడాది అమెరికాలో కరోనా మరణమృదంగం వాయించింది. లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు సంబవించాయి. అయితే ఇక్కడ కరోనా వైరస్ ఇబ్బంది ఒక్కటే కాదు.. గన్ కల్చర్ కూడా ప్రజలకు మనశ్శాంతి లేకండా చేస్తుంది. అమెరికాలో విచ్చలవిడిగా గన్ కల్చర్ పెరిగిపోతుంది. తాజాగా మరోసారి అమెరికాలో కాల్పుల మోత కలకలం సృష్టించింది.

కాలిఫోర్నియాలోని శాన్ జోన్ ప్రాంతం పబ్లిక్ ట్రాన్సిట్ మెయింటెన్స్ యార్డ్ లో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. కంపౌండ్ లోపల పేలుడు పదార్థాలు ఉండడంతో బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు జరిపారు.అయితే కాల్పులకు పాల్పపడ్డ దుండగుడు కూడా మృతి చెందాడు. మృతులంతా ఒకే కంపెనీ చెందిన వారిగా గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారి రస్సెల్ డెవిస్ తెలిపారు.

ఈ ఘటనపై వైట్ హౌస్ డిప్యూటి ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ ఫియెర్ విచారం వ్యక్తం చేశారు. యూనియన్ సమావేశం జరుగుతుండగా కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని శాన్‌జోస్‌ మేయర్‌ సామ్‌ లిక్కార్డో తెలిపారు.

చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు

30న కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్ పొడిగింపు?

నేటి పంచాంగం,గురువారం(27-05-2021)

జర్నలిస్టుల ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు : సీఎం స్టాలిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -