Tuesday, April 30, 2024
- Advertisement -

30న కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్ పొడిగింపు?

- Advertisement -

రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 30న (ఆది వారం) మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ వల్ల కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని యోచిస్తోంది. నిజానికి ఈ నెల 30తో లాక్‌డౌన్ ముగియనుంది. లాక్‌డౌన్ సత్ఫలితాలనే ఇచ్చిందని, మరికొన్ని రోజులు పొడిగిస్తే కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక కరోనా నియంత్రణ చర్యలు, వ్యవసాయం, పంటలు, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, వి త్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, ప్రస్తుత తీవ్రత, పరిస్థితులపై పూర్తిస్థాయిలో చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకో నుంది. అలాగే, బ్లాక్ ఫంగస్‌కు చికిత్స, ఔషధాలు, రెండోదశ టీకాలు, కొవిడ్ పరీక్షల పెంపు, ఆక్సిజన్ ఉత్పత్తి, సేకరణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, వానాకాలం పంటల ప్రణాళిక తదితర అంశాలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు.

దాంతోపాటే ఇంటింటి జ్వర సర్వే, వ్యాక్సి నేషన్‌పై కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లపైనా కేబినెట్‌లో సమీక్షించనున్నారు. వానాకాలం పంట సీజన్ ప్రారంభమవుతోన్న తరు ణంలో పంటల మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానుంది.

జర్నలిస్టుల ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు : సీఎం స్టాలిన్

స్టార్ హీరో సరసన కీర్తి సురేష్?

నిఖిల్ ‘18 పేజీస్’ ఫ‌స్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -