అంతర్జాతీయ విమాన ప్రయాణ సర్వీసులపై నిషేధం పొడిగింపు..!

- Advertisement -

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణ సర్వీసులపై నిషేధాన్ని డిసెంబర్​ 31 వరకు కొనసాగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే సరకు రవాణా సేవలు, అనుమతి పొందిన విమానాలకు ఎటువంటి అంతరాయం ఉండబోదని పేర్కొంది.

అంతర్జాతీయ విమానాలు అనుమతి పొందిన మార్గాల్లో మాత్రమే నడుస్తాయని డీజీసీఏ తెలిపింది.కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి కేంద్రం అన్ని అంతర్జాతీయ సేవలను నిలిపివేసింది. ఈ నిషేధం నవంబర్ 30 తో ముగియనుండగా డీజీసీఏ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...