Saturday, April 20, 2024
- Advertisement -

ఇజ్రాయెల్, పాలస్తిన భీకర యుద్దం.. అసలేం జరుగుతోంది !

- Advertisement -

ఇటీవల రష్యా ఉక్రెయిన్ వార్ ప్రపంచ దేశాలలో ఏ స్థాయిలో చర్చనీయాంశం అయిందో అందరికీ తెలిసిందే. ఈ వార్ ఇంక ముగిసిపోక ముందే మరో రెండు దేశాల మద్య వార్ కు తెర లేచింది. గత రెండు రోజులుగా ఇజ్రాయెల్- పాలస్తీనా దేశాల మద్య యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఈ రెండు దేశాల మద్య వైరం ఎప్పటి నుంచో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోసారి ఈ రెండు దేశాల మద్య అగ్గి రాజుకుంది. పాలస్తీనా కు చెందిన “పాలస్తిన ఇస్లామిక్ జిహాద్ ” అనే ఉగ్రవాద సంస్థ.. ఇజ్రాయెల్ పై సుమారు 400 పైగా యుద్ద రాకెట్లతో పాటు, మోర్టార్లను ప్రయోగించారని ఇజ్రాయెల్ తెలిపింది.

దీంతో పాలస్తీనాలోని గాజాలో ఉన్న పీఐజే ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో గాజాలో పదుల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఆత్మ రక్షణకే తాము ఈ దాడులు చేస్తున్నాల్టు ప్రకటించింది. ఇక గత ఏడాది మే లో కూడా తీవ్ర స్థాయిలో పాలస్తిన- ఇజ్రాయెల్ మద్య వార్ జరిగిన విషయం తెలిసిందే.

ఆ వార్ లో దాదాపుగా 300 మందికి పైగా పాలస్థినియన్లు మరణించగా, వందల కొద్ది గాయపడ్డారు. ఇక ఆ తరువాత మళ్ళీ ఆ స్థాయిలో ఇరు దేశాల మద్య ప్రస్తుతం యుద్ద వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులు తప్పవని పాలస్తీనా మిలిటెంట్లు హెచ్చరించడంతో ఇజ్రాయెల్ అంతటా కూడా ఎమర్జెన్సీ విధించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాల మద్య నెలకొన్న తాజా పరిణామాలతో పశ్చిమ ఆసియా దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి.

Also Read

చైనా భారత్ ను ఎందుకు టార్గెట్ చేస్తోంది ?

సంక్షోభం గుప్పెట్లో.. మరికొన్ని దేశాలు ?

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -