చైనా భారత్ ను ఎందుకు టార్గెట్ చేస్తోంది ?

ప్రస్తుతం భారత్, చైనా మద్య నెలకొంటున్న పరిస్థితులు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తున్నాయి. ఇరు దేశాల మద్య సరిహద్దు వివాదం గత కొన్నేళ్ళ నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. చైనా అప్పుడప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడడం.. వాటిని భారత బలగాలు సమిష్టిగా తిప్పికొట్టడం తరచూ జరుగుతూనే వస్తోంది. అయితే ఈ సరిహద్దు వివాదానికి ముగుంపు పలికేందుకు ఇటీవల ఇరు దేశాల మద్య చర్చలు జరిగాయి. అయితే చర్చలు ఏమాత్రం ఫలించకపోవడంతో ఇండియా చైనా మద్య మరోసారి చిచ్చు రగులుకుంది.

అయితే ఇప్పటివరకు అరుణచల్ సరిహద్దు వద్ద ఉద్రికత సృస్టించిన చైనా.. ఇప్పుడు కొత్తగా సిక్కిం వద్ద ఒక్క అడుగు ముందుకు వేసి ఏకంగా గ్రామాన్నే నిర్మించింది. భూటాన్-భారత్- చైనా ట్రైజెంక్షన్ లో ఈ గ్రామాన్ని నిర్మించడంతో మరోసారి ఇరు దేశాల మద్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే సరిహద్దు విషయంలో భూటాన్ సైలెంట్ గా ఉండడం కూడా కొత్త చర్చలకు తావిస్తోంది. ఎందుకంటే భూటాన్, చైనా మద్య కూడా సరిహద్దు వివాదాలు నడుస్తున్నాయి. కానీ గత ఏడాది ఆ రెండు దేశాలు కూడా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

అందువల్ల మూడు దేశాల ట్రైజంక్షన్ సరిహద్దు వద్ద చైనా గ్రామాన్ని నిర్మించినప్పటికి భూటాన్ సైలెంట్ గా ఉంటోందని విశేషకులు చెబుతున్నారు. ట్రైజంక్షన్ లో చైనా నిర్మించిన ఈ గ్రామం.. భారత్ లోని డోక్లాం పీఠభూమి కి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దాంతో మెల్ల మెల్లగా డోక్లామ్ పీఠభూమిపై పట్టు సాధించేందుకు చైనా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ డోక్లామ్ పీఠభూమిపై చైనా పట్టు సాధిస్తే.. భారత్ కు పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. మరి భారత్ ను జెట్ స్పీడ్ తో టార్గెట్ చేస్తున్న చైనాను ఎదుర్కొనేందుకు మనదేశం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.

Also Read

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

తైవాన్ చిచ్చు.. అమెరికా-చైనా వార్ ?

పతనమైన రూపాయి.. దేనికి సంకేతం !

Related Articles

Most Populer

Recent Posts