Friday, April 26, 2024
- Advertisement -

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

- Advertisement -

ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో మన దేశం కూడా ఒకటి. విద్యా, వైద్య, సాంకేతికత ఇలా అన్నీ రంగాల్లోనూ ఇండియా దూసుకుపోతుంది. దీంతో ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని ఎన్నో ప్రముఖ సంస్థలు ఇండియా వైపు చూస్తున్నాయి. అందువల్ల ఇతర దేశాలనుంచి ఇండియా కు వచ్చే వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే ఇండియాలో పుట్టి పెరిగిన చాలామంది మాత్రం మనదేశ పౌరసత్వాన్ని విడిచి పెట్టి ఇతర దేశాలలో స్థిరపడేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పరంగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎక్కువగా ఆకర్షితులవుతున్న ఇండియన్స్ .. అక్కడే స్థిరపడుతూ మన దేశ పౌరసత్వాన్ని కూడా విడిచిపేందుకు వెనుకాడడం లేదు. తాజాగా మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తూ స్థిరపడుతున్న వారి నివేదికను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రస్తావించింది. 2021 లో 1,63,370 మంది ఇండియన్స్ వారి పౌర సత్వాన్ని వదులుకొని ఇతర దేశాల్లో స్థిరపడ్డారని హోమ్ శాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంట్ లో వెల్లడించారు. ఇక 2019 లో 1,44,017 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకోగా 2020 లో 85,256 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇక 2021 వచ్చే నాటికి ఆ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కేంద్రప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది.

ఇక భారతీయులను ఎక్కువగా ఆకర్షిస్తున్న దేశాలలో అమెరికా ముందు వరుసలో ఉంది. 2021 దాదాపుగా 78,284 మంది భారతీయ పౌరసత్వాన్ని విడిచి అమెరికా పౌరసత్వం స్వీకరించారు. ఇక ఆ తరువాత ఆస్ట్రేలియాలో 23,533 మంది, కెనెడా 21,597 మంది.. ఇండియా పౌరసత్వం విడిచి ఆ దేశాల పౌరసత్వం స్వీకరించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ దేశాలే కాకుండా స్వీడెన్, జర్మనీ, ఇటలీ, సింగపూర్ వంటి దేశాలలో కూడా చాలా మంది భారతీయులు స్థిరపడుతు ఇండియన్ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు.

More Like This

తైవాన్ చిచ్చు.. అమెరికా-చైనా వార్ ?

క్రిప్టో కరెన్సీ బ్యాన్.. సాధ్యం కదా ?

సంక్షోభం గుప్పెట్లో.. మరికొన్ని దేశాలు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -