న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్మమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. ఈ భేటీలో ఆయన ముఖ్యంగా నోట్ల రద్దు వల్ల
కలుగుతున్న నష్టాల్ని ఆయన మోడీకి వివరించారు. రాష్ట్ర ఖజానికు వాటిల్లతున్న నష్టం, ప్రజలు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వైనం మొత్తాన్ని పూర్తి స్థాయి నివేదికలతో ఆయనకు సమర్పించారు. మోడీ అన్నింటినీ శ్రద్దగా విన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో సడెన్‌గా మారిపోయిన పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేయాల్సిందిగా విన్నవించారు కేసీఆర్. అయితే ఈ భేటీలో ముఖ్యమైన విషయమేమేంటే..
నోట్ల రద్దు ప్రకటన వెలువడిన తర్వాత దీని గురించి ప్రధానితో మాట్లాడేందుకు పూనుకున్న మొదటి వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్. మిగతా రాష్ట్ర సీఎంలలో కొందరు పొగిడారు, ఇంకొందరు విమర్శించారు కానీ ఎవరూ కూడా వెళ్లి ప్రధానిని కలిసి సమస్యలు వాటి పరిష్కారాల గురించి చర్చించలేదు. అందుకే మోదీని కేసీఆర్ ఫోన్లో సంప్రదించగానే ఆయన కూడా ఢిల్లీకి రమ్మని ఆహ్వానించడం ఇక్కడ విశేషం. అయితే కేసీఆర్ చేసిన ప్రతిపాదనలు వాటి అమలు సంగతి ఏంటనేది తెలియడానికి వేచి చూడాల్సిందే.
