Sunday, May 5, 2024
- Advertisement -

కొత్త రాజ‌కీయ పార్టీని స్థాపించ‌నున్న జ‌స్టిస్ కర్ణన్..

- Advertisement -

కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ సంచలన విషయాన్ని ప్రకటించారు. ‘యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ’ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. పార్టీనుంచి కేవలం మహిళలను మాత్రమే బరిలోకి దింపుతామని తెలిపారు.

దేశం నుంచి అవినీతిని పారద్రోలడమే తమ పార్టీ సిద్ధాంతమని చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలవనున్నట్టు తెలిపారు. కోల్‌కత్తా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న అభియోగంపై ఆయనకు 6 నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు విధించిన సంగతి తెలిసిందే.

వ్యవస్థాపక సభ్యుని హోదాలో నేను పార్టీని స్థాపించాను. మహిళలు మాత్రమే పార్టీ తరుపున పోటీ చేస్తారు. దేశంలో అన్ని స్థానాలను మేమే గెలుచుకోగలమన్న నమ్మకం ఉంది. పార్టీ నుంచి నన్ను కూడా పోటీ చేయమని అడుగుతున్నారు. వారణాసి నుంచి పోటీ చేయాల్సిందిగా కోరార‌న్నారు.

ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే.. మొత్తం ఐదేళ్ల పదవీకాలానికి గాను ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరికి ప్రధానిగా అవకాశం ఇస్తామన్నారు. ‘2019-20లో ఒక ముస్లిం మహిళ దేశానికి ప్రధాని కావాలి. ఆ తర్వాత ఓ అగ్రకుల మహిళ.’ అని చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -